తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Shamshabad Airport: ఇకపై ఎయిర్ పోర్టుకు ట్రిప్పులు కొట్టమని ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లు తేల్చి చెప్పారు. తమ సేవలను ఉపయోగించుకుంటున్న ఈ సంస్థలు నామమాత్రపు కిరాయిలను మాత్రమే చెల్లిస్తున్నాయాన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ నేత్రుత్వంలో నిరసన చేపట్టామన్నారు.
కంపెనీలు నామమాత్రగా ఇస్తున్న కిరాయిల కారణంగా కుటుంబాలను పోషించుకోలేక అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయిలు పెంచాలని ఆయా కంపెనలకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవటంలేదన్నారు. సొంత లాభానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు.
సీఎం స్పందించాలి…
క్యాబ్ సేవలు అందిస్తున్న వేలాది మంది ఎదుర్కొంటున్న ఈ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ ఫౌండర్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ కోరారు. ఈ విషయపై గతంలో ప్రభుత్వతోపాటు, రవాణా శాఖ అధికారులకు పలుమార్లు లిఖితపూర్వక విజ్ఞప్తులు చేసినట్టు తెలిపారు.
Also Read: Pawan Kalyan: నేషనల్ పాలిటిక్స్ లోకి పవన్? జనసేనకు కలిసి వచ్చేనా?
అయితే, ఎవ్వరూ స్పందించ లేదన్నారు. ఈ క్రమంలనే ఎయిర్ పోర్టుకు క్యాబ్ సేవలు అందించ వద్దని నిర్ణయించామన్నారు. సమస్య తీరే వరకు తమ నిరసన కొనసాగుతుందని చెప్పారు. దీని కారణగా ఎయిర్ పోర్టుకు వచ్చి వెళ్లే ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు.