Ponnam Prabhakar In BJP: బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా..? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..బీజేపీ మత విద్వేషాలను రెచ్చకొడుతుందన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హిందుత్వ వాదులు బీజేపీ కి ఓటు వేయాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన పై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఎన్నికల కమిషన్ బండి సంజయ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మతపరైన అంశాలతో కాంగ్రెస్, బీఆర్ ఎస్ కార్పొరేటర్ల ఇళ్ల ముందు బీజేపీ ప్లెక్సీలు కట్టడం సరికాదన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 112 ఓట్లు ఉండగా, బీఆర్ ఎస్ కు 24, బీజేపీకి 24 చొప్పున ఓట్లు ఉండగా, ఎంఐఎంకు 50, కాంగ్రెస్ కు 14 ఓట్లు ఉన్నాయన్నారు.
Also read: Madhavaram Krishna Rao: హైడ్రాను తెగ పొగిడేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
ఈ సీటు లో 50 ఓట్ల మెజారిటీతో ఉన్న ఎంఐఎం గెలిచే ఛాన్స్ ఎక్కువన్నారు. కానీ మెజార్టీ లేని బీజేపీ అభ్యర్ధిని రంగంలోకి దించి ఏం సంకేతం ఇవ్వాలని ప్లాన్ చేసిందో? తెలియడం లేదన్నారు.ఇక బీజేపీకి హెల్ప్ చేసేందుకు బీఆర్ ఎస్ ఎన్నికలను బహిష్కరించిందన్నారు. కాంగ్రెస్ బరాబర్ ఓటింగ్ లో పాల్గొంటుందన్నారు. ఎన్నికల్లో హిందుత్వ ఎజెండా ప్రమాదకరమన్నారు.