Madhavaram Krishna Rao(image credit:x)
హైదరాబాద్

Madhavaram Krishna Rao: హైడ్రాను తెగ పొగిడేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

Madhavaram Krishna Rao: న‌గ‌రంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా చేస్తున్న కృషిని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే  మాధ‌వ‌రం కృష్ణారావు అభినందించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువును పైల‌ట్ ప్రాజెక్టుగా తీసుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. నియోజకవర్గంలో మిగిలిన చెరువులను కూడా అభివృద్ధి చేయాల‌ని మంగ‌ళ‌వారం ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌తో హైడ్రా క‌మిష‌న‌ర్  ఏవీ రంగ‌నాథ్ ని క‌లిసి వినతి పత్రాన్ని అందజేశారు.

చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న భూ యజమానులతో పాటు ప్లాట్లు ఉన్న‌వారికి టీడీఆర్ కింద త‌గిన న‌ష్ట ప‌రిహారం అందేలా చూడాల‌ని కోరారు. న‌కిలీల‌కు ఆస్కారం లేకుండా అస‌లు ల‌బ్ఢిదారులను గుర్తించాల విన‌తిప‌త్రంలో పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన చెరువుల్లో మురుగు నీరు క‌ల‌వ‌కుండా నాలాల‌ను డైవ‌ర్ట్ చేయాల‌ని సూచించారు. కబ్జాలకు పాల్పడిన వారు ఎవ‌రైనా.. పార్టీల‌తో సంబంధం లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Also read: Mahesh Kumar Goud: మళ్లీ అధికారం మాదే.. పీసీసీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు!

బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఐడీఎల్ చెరువు, బోయిన చెరువును, ములకత్వ చెరువు నల్ల చెరువులో కొంత భాగం సుందరీకరణ చేశామ‌ని.. కోర్టు కేసులుండ‌డంతో ప‌నులు పూర్తి చేయ‌లేక‌పోయామ‌ని ఎమ్మెల్యే  మాధ‌వ‌రం కృష్ణారావు చెప్పారు. అస‌లైన ల‌బ్ధిదారుల‌ను గుర్తించి వారికి న‌ష్ట ప‌రిహారం అందేలా చూస్తామ‌ని.. అలాగే న‌గ‌రంలోని అన్ని చెరువుల అభివృద్ధి ప‌నుల‌ను ప్రాధాన్య క్ర‌మంలో చేప‌డ‌తామ‌ని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేకు వివ‌రించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు