Ponnam Prabhakar: హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని , ప్రజలకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదన్నారు. కానీ అనుమానస్పద వ్యక్తులు, పరిస్థితులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
Also Read: Minister Sridhar Babu: దేశ సమగ్రతకు మేమంతా అండగా నిలుస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు!
జై హింద్ .. ఆపరేషన్ సింధూర్ విజయవంతం తో సాయుధ దళాలను చూసి గర్విస్తున్నానని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ , కంచన్ బాగ్ , నానాల్ నగర్ లలో మాక్ డ్రిల్ జరిగిందని, కంటోన్మెంట్ ఏరియా కేంద్రంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం అంతర్గత భద్రతకు సంబంధించి కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందన్నారు.పోలీస్ అధికారులు, స్టాఫ్ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటరింగ్ చేయాలని సూచించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు