Kidney Racket Case: సంచలనం సృష్టించిన సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాలను తెప్పించుకుంటున్నారు. కొంతకాలం క్రితం సరూర్ నగర్ అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన కిడ్నారాకెట్ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై కేసులు నమోదు చేసిన రాచకొండ పోలీసులు అలకనంద హాస్పిటల్ యజమాని డాక్టర్సుమంత్, జనరల్సర్జన్ గా ఉన్న డాక్టర్సిద్దంశెట్టి అవినాశ్ తోపాటు పొన్నుస్వామి ప్రదీప్, సూరజ్చ మిశ్రా, నర్సగాని గోపీ, రమావత్ రవి, సపావత్ రవీందర్, సపావత్ హరీష్, పొదిల్ల సాయి తదితరులను అరెస్ట్ చేశారు. వీరిని జరిపిన విచారణలో విశాఖపట్టణానికి చెందిన పవన్ ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అని వెల్లడైంది.
Also Read: Hydraa demolition: పుప్పాల గూడలో అక్రమ కట్టడాలు కూల్చివేత..!
పేదరికంలో మగ్గుతున్న వారికి డబ్బు ఆశ చూపించి వారిని డోనార్లుగా మార్చి పవన్ కిడ్నీ మార్పిడులు చేయించినట్టుగా తేలింది. ఇలా హైదరాబాద్ లో 90కి పైగా ఆపరేషన్లు చేయించినట్టుగా నిర్ధారణ అయ్యింది. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఒక్కొక్కరి నుంచి 50లక్షలు వసూలు చేసినట్టుగా వెల్లడైంది. ఈ ఆపరేషన్లన్నీ సైదాబాద్ లోని జననీ హాస్పిటల్, సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రి, ఎల్బీనగర్ లోని అరుణ హాస్పిటల్లో చేయించినట్టుగా సమాచారం. కాగా, రాకెట్ గుట్టు బయట పడగానే పవన్ పరారయ్యాడు. ప్రస్తుతం అతను విదేశాల్లో తలదాచుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.
Also Read: Charminar Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా!