మేడ్చల్, స్వేచ్ఛ: Rooster Fight Organisers: కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు చేసిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్ సమీపంలో కోళ్ల పందాలు ఆడుతున్నారని సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకొని కోడి పందాలు ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విచారించగా వారు తెలిపిన దేవరయాంజాల్ సమీపంలోని బాల్ రెడ్డి తోటలోని ఒక ఖాళీ స్థలానికి వెళ్లి చూడగా 9 మంది వ్యక్తులు ప్రభుత్వ నిషేధిత కోడి పందాలు ఆడుతుండటంతో, పోలీసులను చూసి కొంతమంది పారిపోయారని పోలీసులు తెలిపారు. వారి వద్ద 2 గాయపడిన కోళ్లు, కొంత డబ్బు, ఉన్నాయని తెలిపారు. 9 మందిలో ముగ్గురు పారిపోగా ఆరు గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆంధ్రలోని తణుకులో 2 కోళ్లను, పాలకొల్లు లో 15 కోడి కత్తులను కొన్నట్లు నిందితులు తెలిపారని చెప్పారు. వారి వద్ద నుంచి 26వేల 940 నగదు, 2 గాయపడిన కోళ్లను, 15 కోడి కత్తులను, 7 ఫోన్లను, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు.
Also read: Chain Snatcher Arrested46: చైన్ లు లాగేశాడు.. పోలీసులకు చిక్కాడు