Chain Snatcher Arrested46[image credt; twitter]
తెలంగాణ

Chain Snatcher Arrested46: చైన్ లు లాగేశాడు.. పోలీసులకు చిక్కాడు

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Chain Snatcher Arrested: రద్దీగా ఉన్న బస్సుల్లో తిరుగుతూ మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు తెంచుకుని ఉడాయిస్తున్న పాతనేరస్తున్ని సౌత్​ ఈస్ట్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు హుమాయున్​ నగర్​ పోలీసులతో కలిసి అరెస్ట్​ చేశారు. నిందితుని నుంచి లక్షా 70వేల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మహిళ ఈనెల 29న బస్సులో మెహదీపట్నం వచ్చింది. స్టాపులో బస్సు దిగుతుండగా అగంతకుడు ఆమె మెడలోని రెండు తులాల మంగళసూత్రాలను తెంచుకుని ఉడాయించాడు.

ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా హుమాయున్​ నగర్​ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, టాస్క్​ ఫోర్స్​ సీఐ సైదాబాబు, హుమాయున్​ నగర్​ సీఐ మల్లేష్​ తోపాటు సిబ్బందితో కలిసి ఈ కేసులో విచారణ చేపట్టారు. బస్టాప్​ లోని సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించారు. ఈ క్రమంలో లభ్యమైన ఆధారాలతో మల్లేపల్లి బడీ మసీదు ప్రాంత నివాసి అయిన షేక్​ సద్దాం హుస్సేన్​ (32)ను అరెస్ట్​ చేశారు. అతని నుంచి మంగళసూత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

 Also Read: Pithapuram News: డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో ఆటో దందా.. బెంబేలెత్తుతున్న ప్రజలు!

విచారణలో నిందితుడు సహచరుడైన రాజేశ్​ తోపాటు మరికొందరితో కలిసి గతంలో నగరంలోని వేర్వేరు పోలీస్​ స్టేషన్ల పరిధుల్లో మొత్తం 46 నేరాలకు పాల్పడినట్టుగా వెల్లడైంది. ఇంతకు ముందు నారాయణగూడ పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టుగా తెలిసింది. అరెస్ట్​ చేసిన నిందితున్ని కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్​ చేశారు. పరారీలో ఉన్న అతని సహచరుల కోసం గాలిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?