Drugs Case: పక్కగా అందిన సమాచారంతో ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి 42గ్రాముల ఓజీ కుష్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిని విక్రయిస్తున్ని ఇద్దరిని అరెస్ట్ చేసి కారు, టూ వీలర్, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. బేగంపేటలోని సింధి కాలనీలో గంజాయి దందా జరుగుతున్నట్టు తెలిసి ఎస్టీఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. విచారణలో మరో పదిమందికి కూడా ఈ దందాతో సంబంధం ఉన్నట్టుగా తేలటంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ నిందితులను జరిపిన విచారణలో వెల్లడైన వివరాల మేరకు మరో ఇద్దరిని ధూల్ పేట ప్రాంతంలో అరెస్ట్ చేసి 29.8గ్రాముల ఓజీ కుష్ గంజాయిని సీజ్ చేశారు. ఈ కేసులో బెహ్రా అనే వ్యక్తితోపాటు మరొకరిని అరెస్ట్ చేశారు.
Also Read: Drugs Case: షాకింగ్.. డ్రగ్స్‌కు బానిసైన నమ్రత.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
ఎండీఎంఏ డ్రగ్ తో మహిళ అరెస్ట్
డ్రగ్స్ కు అలవాటు పడ్డ మహిళతోపాటు ఆమెకు మాదక ద్రవ్యాలను సప్లయ్ చేస్తున్న వ్యక్తిని ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ వాస్తవ్యురాలు శ్రీయ కొన్ని రోజులుగా డ్రగ్స్ కు అలవాటు పడింది. ఈ క్రమంలో ప్రణీత్ అనే వ్యక్తి ద్వారా ఎండీఎంఏ డ్రగ్ తెప్పించుకుంటోంది. ఈ మేరకు సమాచారాన్నిసేకరించిన ఎస్టీఎఫ్ బీ టీం సీఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజుతోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 0.40గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే టీం సిబ్బంది హస్తినాపురంలో గంజాయి అమ్ముతున్న నితీష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 252 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు.
Also Read: Fake Drugs: దొంగ మందులపై డీసీఏ తనిఖీల కొరడా

