Drugs Case: ఆ మహిళ ఓ డాక్టర్. ఎంతో కష్టపడి.. ఉన్నత చదవులు చదివి ప్రజలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి.. వైద్యురాలే తప్పుడు మార్గంలో నడిచింది. డ్రగ్స్‌కు బానిసగా మారి.. రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కి ఇప్పుడు ఊచలు లెక్కెడుతోంది. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తుండగా హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆ మహిళా డాక్టర్ పేరు చిగురుపాటి నమ్రత (34). ఒమేగా హాస్పిటల్ సీఈవో వ్యవహరిస్తున్నారు. ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. తన నివాసం షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్‌మెంట్‌లో అడ్డంగా దొరికిపోయారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమ్రత ఉన్న పరిస్థితిని చూసిన పోలీసులు.. రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.
ఇలా పట్టుబడింది..!
కాగా, నమ్రతకు వంశ్ టక్కర్‌తో గత కొన్నిరోజులుగా పరిచయం ఉంది. కొంతకాలంగా స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తున్నారు. అయితే గురువారం నాడు కూడా తనకు డ్రగ్స్ పంపాలని కోరింది. రూ.5 లక్షలు ఆన్‌లైన్ ద్వారా పంపి 53 గ్రాముల కొకైన్ ఆర్డర్ ఇచ్చింది నమ్రత. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు.. బాలకృష్ణ నుంచి నమ్రత కొకైన్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దిరినీ అదుపులోనికి తీసుకున్న పోలీసులు వారి నుంచి కొకైన్‌తో పాటు.. రూ. 10 వేల నగదు, 2 సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. కాగా, వంశ్ అనుచరుడే బాలకృష్ణ రామ్ ప్యార్. ఇదిలా ఉంటే డాక్టర్ బ్యాగ్రౌండ్ తెలుసుకున్న పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. నమ్రతకు ఏం పోయేకాలం? అంటూ నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.

పేరు మోసిన ఫ్యామిలీ..
ఈమె తండ్రి కూడా డాక్టర్.. అందులోని కార్పొరేట్ ఆస్పత్రి యజమాని కావడం గమనార్హం. చేతిలో కావాల్సినంత డబ్బులు ఉన్నా.. దురలవాట్ల కోసం ఇలా డ్రగ్స్ వాడకమేంటి? అని ఈ విషయం తెలుసుకున్న బంధుమిత్రులు నివ్వెరపోతున్నారు. వంశ్ టక్కర్‌తో నమ్రతకు ఓ పబ్‌లో పరిచయం అయినట్లుగా తెలిసింది. అప్పట్నుంచి ఆ డ్రగ్స్‌కు ఆమె అడిక్ట్ అయినట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఏడాదిలో ఏకంగా రూ.70 లక్షల నుంచి కోటి రూపాయిల వరకూ డ్రగ్స్ కొనుగోలు చేసి వాడినట్లుగా తెలుస్తున్నది. కోట్లకు కోట్లు డబ్బులు సంపాదించడమే కాదు.. పిల్లల భవిష్యత్‌ను కూడా పట్టించుకోవాలని సామాన్యులు మండిపడుతున్నారు. కుమార్తెను కాస్త కనిపెట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? ఇప్పుడు ఆ డాక్టర్ ఎంత ఖర్చు పెట్టినా కుమార్తె మామూలు స్థితికి వస్తుందా? అంటూ సన్నిహితులు సైతం కన్నెర్రజేస్తున్నారట.