Niloufer Superintendent: నిలోఫర్ సూపరింటెండెంట్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఓ ఫార్మసీ ఇష్యూలో ఏకంగా జిల్లా కలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ను బ్లేమ్ చేయాలని ప్రయత్నించారు. వైద్యారోగ్యశాఖ మంత్రిపై కూడా అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. చివరకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్లేట్ ఫిరాయించి కొత్త కహానీ సృష్టించారు. నిలోఫర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ ప్రైవేట్ ఫార్మసీ కోసం నిర్మాణం జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది.
రాత్రికి రాత్రే కట్టడాలు చేపడుతున్న నేపథ్యంలో వివిధ సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులు ఆరా తీశారు. ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ ఫార్మసీ కట్టవచ్చా? అని ఎంక్వైయిరీ చేశారు. సూపరింటెండెంట్ వివరణ కోరగా, కలెక్టర్, డీఎంఈ అనుమతులతోనే నిర్మాణం జరుగుతుందని సూపరింటెండెంట్ మీడియాకు చెప్పారు. మంత్రికి కూడా తెలుసునని సూపరింటెండెంట్ అత్యుత్సాహం ప్రదర్శించారు.
Aslo Read: Hyderabad Development: హైదరాబాద్ డెవలప్ పై సీఎం ప్రత్యేక ఫోకస్.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!
విషయం తెలుసుకున్న మంత్రి కార్యాలయం, కలెక్టర్, డీఎంఈలు లు సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా, వెంటనే ప్లేట్ ఫిరాయించారు. ఈ కట్టడం జనరిక్ కోసం జరుగుతుందంటూ బుకాయించారు. అక్కడితో ఆగకుండా పాత జీవోను సర్క్యూలేట్ చేస్తూ తాను చేసేదంతా కరెక్టే అని చెప్పేందుకు ప్రయత్నాలు చేశారు. ఉన్నతాధికారుల నుంచి సీరియస్ వార్నింగ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఆ ఇష్యూను సైడ్ ట్రాక్ చేసేందుకు ట్రై చేశారు. ఇది ఇప్పుడు ఆసుపత్రి డాక్టర్లతో పాటు ప్రభుత్వంలోనూ హాట్ టాపిక్ గా మారింది.
అక్రమ నిర్మాణం కూల్చివేత….ఆ మతలబు ఏమిటో..?
ఇక నీలోఫర్ హాస్పిటల్‌లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రైవేట్ మెడికల్ షాపును హైదరాబాద్ రెవెన్యూ అధికారులు గురువారం సాయంత్రం కూల్చివేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు, ఆసిఫ్ నగర్ ఎమ్మార్వో జ్యోతి ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల సమయంలో ఈ కూల్చివేత కార్యక్రమం జరిగింది. దాదాపు గంటపాటు శ్రమించి ఈ అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించారు. ఆ తర్వాత సూపరింటెండెంట్ కొత్త స్టోరీ సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేయడం గమనార్హం. ఇక ఓ ప్రైవేట్ మెడికల్ షాపు ఏర్పాటు కోసం సూపరింటెండెంట్ అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? అనే చర్చ మొదలైంది.
మంత్రి దగ్గర్నుంచి కలెక్టర్ వరకు వార్నింగ్ లు వెళ్లినా..ఆ ప్రైవేట్ ఫార్మసీ నిర్మాణం కోసమే సూపరింటెండెంట్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా ఆ ఫార్మసీని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ ఫాపు కోసం భారీ స్థాయిలో చేతులు మారాయనే ప్రచారం స్వయంగా డాక్టర్లే చేస్తున్నారు. నిలోఫర్ లోని కొందరు డాక్టర్లు సూపరింటెండెంట్ తో కుమ్మక్కై ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం కూడా గుర్తించింది. ఎవరెవరు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు? అనే అంశాలపై సర్కార్ సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది.
Also Read: Miss Indonesia: నంబర్ వన్ మిస్ ఇండోనేషియా.. ముగిసిన వరల్డ్ టాలెంట్ షో గ్రాండ్ ఫైనల్!
పుల్ ఫోకస్ పెట్టండి…?
గతంలో బ్లడ్ బ్యాంక్ దోపిడి, మిషన్ల కొనుగోళ్లలో గోల్ మాల్, లైంగిక వేధింపుల ఆరోపణలు, తదితర అంశాలన్నీ నిలోఫర్ ఆసుపత్రిలోనే తరచూ జరగడంపై హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ కూడా ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారు. ప్రత్యేకంగా సూపరింటెండెంట్ ప్రవర్తన, పనితీరుపై ఫోకస్ పెట్టాలని ఆమె డీఎంఈ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో పాటు ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది? ఎవరెవరి ప్రమోయంతో తప్పిదాలు జరుగుతున్నాయి? అనే అంశాలపై కూడా తనకు పూర్తి స్థాయిలో స్టడీ చేసి రిపోర్టు కావాలని సిక్రెట్ టీమ్ లకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.
ఇది లా ఉండగా, ఆసుపత్రిని మెయింటెన్ చేయలేక సూపరింటెండెంట్ సతమతమవుతున్నాడని, డాక్టర్లు సమన్వయం, ఉద్యోగుల మానిటరింగ్, ఆసుపత్రి ట్రీట్ మెంట్ పరిశీలన వంటివేవీ చేయలేకపోతున్నాడని, దీని వలన ఆయన ఇలాంటి తప్పిదాలు చేస్తున్నట్లు ఉద్యోగుల్లో చర్చ. ఆయన ఫోకస్ అంతా ఇతర అంశాలపై ఉంటుందని స్వయంగా ఓ ఆర్ ఎంవో చురకలు అంటించారు.
Also Raed: BRS Kavitha: అధినేత తీరును ప్రశ్నిస్తున్నకవిత.. అన్ని వర్గాల పక్షాన పోరాటానికి సన్నద్ధం!