Mlc kavitha: కవిత రూటే సపరేట్ అని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఆమె లిక్కర్ స్కాం ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కార్యక్రమాల స్పీడ్ పెంచారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ కీలక నేతగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పార్టీ పెడరతారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సభను విశ్లేషిస్తూ రాస్తున్న లేఖ అందుకు మరింత బలం చేకూర్చుతుందనే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని తప్పులను ఎత్తిచూపుతానని, ప్రజల పక్షం అని కవిత స్పష్టం చేస్తున్నారు. పార్టీ వైఫల్యాలను సైతం తాజాగా ఎత్తిచూపుతున్నారు.
పార్టీలో ఎక్కడ లోపాలు ఉన్నాయి.. ఎలా సరిచేయాలి.. పార్టీ కేడర్ కు ఎలా అందుబాటులో ఉండాలి.. పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన అంశాలను సైతం పార్టీ అధినేతకు సూచిస్తున్నారు. అయితే పార్టీలో ఉంటూనే పార్టీ బలోపేతం, జాగృతి బలోపేతంపైనా దృష్టిసారించారు. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా తనకు అనుగుణంగా మలుచుకునే పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. తనకంటూ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం తెచ్చుకోవాలని భావిస్తున్నారు.
Also Read: Revanth Reddy: కోర్టుకు హాజరైన సీఎం రేవంత్.. ఎందుకంటే..?
రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 42 అసెంబ్లీ సెగ్మెంట్లకుపైగా వెళ్లారు. నేతలతో భేటీలు నిర్వహించారు. వారి నుంచి పీడ్ బ్యాక్ తీసుకున్నారు. స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను , కేడర్ నుంచి తీసుకొని వాటిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, తాను నిత్యం అందుబాటులో ఉంటాననే భరోసా ఇస్తున్నారు.
రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొంటూనే తన సైతం బలమైన నేతగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకవైపు బీసీ అంశాలు, మరోవైపు మహిళా సమస్యలు, విద్యార్థి, యువజన ఇలా అందరి సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. అంతేగాకుండా జాగృతి సంస్థను రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం చేయాలని భావిస్తూ ముందుకు సాగుతున్నారు.
కేటీఆర్ తో ఇప్పటికే విభేదాలు ఉన్నాయని, పార్టీలో ఇద్దరు ఇముడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అందుకే కవిత త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారని, బీసీ లు ఉండేవిధంగా పార్టీ పేరును సైతం ఖరారు చేశారనే ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగానే గతంలో ఎప్పుడు లేని విధంగా కవిత రాజకీయాల్లో స్పీడ్ పెంచారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే త్వరలోనే భవిష్యత్ కార్యచరణ సైతం ప్రకటిస్తారనే ప్రచారం సైతం జోరుగా సాగుతుంది. అమెరికా నుంచి శుక్రవారం హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. ఆమె వచ్చిన తర్వాత లేఖపై ఏం మాట్లాడతారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తనపై తప్పుడు ప్రచారం జరుగుతుంది.. నాపై కుట్రలు చేస్తున్నారు.. అసమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని బయటపెడతానని కవిత ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆమెపై కుట్రలు చేసేవారి పేర్లు బయటపెడుతుందా? లేదా అనేది ఆసక్తి కర చర్చకొనసాగుతుంది.
Also Read: Harish Rao Meets KCR: కాళేశ్వరం నోటీసులపై మల్లాగుల్లాలు.. కేసీఆర్‌తో హరీష్ రెండోసారి భేటి!