Harish Rao Meets KCR: కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు మరోమారు భేటి అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన హరీష్.. ఆయనతో సమావేశమయ్యారు. ఈ నెల 20న కూడా కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. రెండ్రోజుల వ్యవధిలోనే మరోమారు వీరిద్దరు సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన ఇరువురు నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం.
మరికాసేపట్లో మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సైతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లనున్నట్లు సమాచారం. భవిష్యత్తు కార్యాచరణపై ముగ్గురు కలిసి చర్చించే అవకాశముంది. నోటిసుల్లోని సారాంశాన్ని అర్థం చేసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచనతో ఈ సమావేశం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమీషన్ వద్దకు లీగల్ గా వెళ్లాలా? లేదా నేరుగా హాజరు కావాలా? అన్న దానిపై హరీష్ రావు, కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Modi Fires on Pakistan: పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం.. పెద్ద శిక్ష వేశాం .. ప్రధాని పవర్‌ఫుల్ స్పీచ్!
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉండగా.. హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి ఇటీవల కమిషన్ నోటీసులు ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ ను జూన్ 5న విచారణకు రావాలని సూచించింది. అలాగే హరీశ్‌రావును జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.