Municipal Election: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా లోని మున్సిపల్ ఎన్నికలకు మహిళా రిజర్వేషన్లను లాటరీ ద్వారా జిల్లా కలెక్టర్ మను చౌదరి ఖరారు చేశారు. త్వరలో జరుగబోయే ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికలకు గాను రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్ఒ హరిప్రియ లతో కలిసి జిల్లా కలెక్టర్ మను చౌదరి సమావేశమయ్యారు. ఎల్లంపేట్ మున్సిపల్ కు 24 వార్డ్ లు, మూడుచింతలపల్లి మున్సిపల్ కు 24 వార్డ్ లు, అలియాబాద్ మున్సిపల్ కు 20 వార్డులకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ప్రణాళికా శాఖ ఆమోదించిన సొషియో, ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, కాస్ట్ సర్వే, 2024 ననుసరించి లాటరీ పద్ధతిన రిజర్వేషన్ల వివరాలను కలెక్టర్ మను చౌదరి ప్రకటించారు. అదేవిదంగా ఇందుకు సంబంధిoచిన గజిట్ ని విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సాంబశివరావు, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ కమిషనర్లు స్వామి, పవన్ కుమార్, చంద్రశేఖర్, సంబంధిత సిబ్బంది, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికలకు ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు
మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు అలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల ఛైర్మన్ ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. అలియాబాద్ మున్సిపల్ ఛైర్మన్ కు జనరల్ మహిళ, ఎల్లంపేట్ మున్సిపల్ ఛైర్మన్ కు ఎస్టీ మహిళా, మూడుచింతలపల్లి మున్సిపల్ ఛైర్మన్ కు ఎస్సీ జనరల్ రిజర్వేషన్ లు ఖరారు అయ్యాయి. ఈ మూడు మున్సిపాలిటీలకు వచ్చె నెలలో ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరో 2, 3 రోజుల్లో ఎన్నికల నొటిఫికేషన్ వచ్చే అవకాశం ుందని సమాచారం.
అలియాబాద్ మున్సిపాలిటీ కి వార్డుల వారిగ రిజర్వేషన్ లు
అలియాబాద్ మున్సిపాలిటీ లో 20 వార్డులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు తుర్కపల్లి ఎస్టి జనరల్, 2వ వార్డు తుర్కపల్లి బీసీ మహిళ, 3వ వార్డు తుర్కపల్లి బీసీ జనరల్, 4వ వార్డు తుర్కపల్లి జనరల్ మహిళ, 5వ వార్డు లాల్ గడి మలక్ పేట్ జనరల్ మహిళ, 6వ వార్డు లాల్ గడి మలక్ పేట్ ఎస్సి జనరల్, 7వ వార్డు అలియాబాద్ ఎస్సీ జనరల్, 8వ వార్డు అలియాబాద్ జనరల్ మహిళ, 9వ వార్డు అలియాబాద్ జనరల్ మహిళ, 10వ వార్డు మజీద్ పూర్ జనరల్ మహిళ, 11వ వార్డు మజీద్ పూర్ జనరల్, 12వ వార్డు యాడారం జనరల్, 13వ వార్డు మురహరిపల్లి జనరల్, 14వ వార్డు తాత్ గడి మలక్ పేట్ ఎస్సీ మహిళ, 15వ వార్డు లాల్ గడి మలక్ పేట్ బీసీ మహిళ, 16వ వార్డు లాల్ గడి మలక్ పేట్ జనరల్, మహిళ, 17వ వార్డు అలియాబాద్ జనరల్, 18వ వార్డు అలియాబాద్ బీసీ జనరల్, 19వ వార్డు అలియాబాద్ బీసీ జనరల్, 20వ వార్డు అలియాబాద్ బీసీ జనరల్ గా రిజర్వేషన్ లు ఖరారు చేశారు.
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కి వార్డుల వారిగ రిజర్వేషన్ లు
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ 24 వార్డులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు కు అనంతారం జనరల్, 2వ వార్డు నారాయణపూర్, పోతారం జనరల్ మహిళ, 3వ వార్డు లక్ష్మాపూర్ జనరల్ మహిళ, 4వ వార్డు మూడుచింతలపల్లి ఎస్సి జనరల్, 5వ వార్డు లక్ష్మాపూర్ జనరల్ మహిళ, 6వ వార్డు మూడుచింతలపల్లి బీసీ జనరల్, 7వ వార్డు లింగాపూర్ తండా, నాగిశెట్టిపల్లి ఎస్టీ జనరల్, 8వ వార్డు ఉద్దెమర్రి బీసీ మహిళ, 9వ వార్డు ఉద్దెమర్రి జనరల్ మహిళ, 10వ వార్డు కేశ్వాపూర్ జనరల్, 11వ వార్డు పొన్నాల్ ఎస్సీ జనరల్, 12వ వార్డు పొన్నాల్ బీసీ మహిళ, 13వ వార్డు జగ్గంగూడ జనరల్, 14వ వార్డు జగ్గంగూడ జనరల్, 15వ వార్డు జనరల్ మహిళ, 16వ వార్డు కొల్తూర్ జనరల్ మహిళ, 17వ వార్డు కొల్తూర్ జనరల్ మహిళ, 18వ వార్డు కొల్తూర్ ఎస్సీ మహిళ, 19వ వార్డు కొల్తూర్ ఎస్సీ జనరల్, 20వ వార్డు కేశవరం బీసీ జనరల్, 21వ వార్డు ఉద్దెమర్రి ఎస్సీ మహిళ, 22వ వార్డు ఆద్రాస్ పల్లి జనరల్, 23వ వార్డు ఆద్రాస్ పల్లి బీసీ జనరల్, 24వ వార్డు కేశవర్ బీసీ మహిళ గా రిజర్వేషన్ ఖరారు చేశారు.
ఎల్లంపేట్ మున్సిపాలిటీ కి వార్డుల వారిగ రిజర్వేషన్ లు
ఎల్లంపేట్ మున్సిపాలిటీ 24 వార్డులకు రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు రావల్ కోల్ జనరల్ మహిళ, 2వ వార్డు రావల్ కోల్ ఎస్టీ జనరల్, 3వ వార్డు రావల్ కోల్ జనరల్ మహిళ, 4వ వార్డు రాజబొల్లారం తండా ఎస్టీ జనరల్, 5వ వార్డు ఘనపూర్ ఎస్టీ మహిళ, 6వ వార్డు రాజబొల్లారం జనరల్ మహిళ, 7వ వార్డు రావల్ కోల్ ఎస్సీ జనరల్, 8వ వార్డు రావల్ కోల్, సైదోనిగడ్డ తండా ఎస్టీ మహిళ, 9వ వార్డు సోమారం, సైదోనిగడ్డ తండా ఎస్టీ జనరల్, 10వ వార్డు ఎల్లంపేట్ జనరల్ మహిళ, 11వ వార్డు ఎల్లంపేట్, డబిల్ పూర్ జనరల్ మహిళ, 12వ వార్డు డబిల్ పూర్ ఎస్సీ మహిళ, 13వ వార్డు డబిల్ పూర్ జనరల్, 14వ వార్డు డబిల్ పూర్ జనరల్, 15వ వార్డు లింగాపూర్ జనరల్, 16వ వార్డు నూతన్ కల్ జనరల్, 17వ వార్డు శ్రీరంగవరం బీసీ జనరల్, 18వ శ్రీరంగవరం వార్డు బీసీ జనరల్, 19వ వార్డు బండమాదారం జనరల్ మహిళ, 20వ శ్రీరంగవరం వార్డు ఎస్సీ మహిళ, 21వ వార్డు నూతన్ కల్, శ్రీరంగవరం ఎస్సీ జనరల్, 22వ వార్డు మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, నూతన్ కల్ జనరల్ మహిళ, 23వ వార్డు డబిల్ పూర్ జనరల్, 24వ వార్డు ఎల్లంపేట్ బీసీ మహిళ గా రిజర్వేషన్ ఖరారు చేశారు.

