MP Chamala Kiran Kumar: రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని హైదరాబాద్ నుండి రాయగిరి(యాదగిరిగుట్ట)వరకు ఎంఎంటిఎస్ రైలు కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పిస్తానన్నారు.
తెలంగాణ తిరుపతి అయినటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు, హైదరాబాద్ కు అప్ అండ్ డౌన్ చేసే కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
Also read: Praise to Auto Driver: రియల్ హీరోగా కాశ్మీర్ ముస్లిం ఆటో డ్రైవర్.. సర్వత్రా ప్రశంసలు.. ఎందుకంటే!
భువనగిరి, ఆలేరు, జనగాం, రామన్నపేటలో, పనులు రైళ్ల రాకపోకల సమయాలు మార్పు , మరియు అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణాల కోసం ఇటీవలే పార్లమెంట్‌లో ప్రస్తావించిన పలు అంశాలు మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కలిసి పలు విషయాలపై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారితో కూలంకశంగా చర్చించి వెంటనే పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మెమోరాండం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.