Praise to Auto Driver: ఓ వైపు తుపాకీ పేలుళ్ల మోతలు.. మరోవైపు మృత్యువులా దూసుకొస్తున్న తూటాలు.. ఏం చేయాలో తెలియక తలోదిక్కు పారిపోతున్న పర్యాటకులు.. ఈ పరిస్థితుల్లో ఓ ఆటో డ్రైవర్ (Kashmir Auto Driver) ఆపద్భాందవుడిగా మారాడు. ముక్కు, ముఖం కూడా తెలియని టూరిస్టులకు నేనున్నా అంటూ అండగా నిలబడ్డాడు. జమ్ము కాశ్మీర్ పహల్గాం టెర్రర్ అటాక్ నుంచి పలువురిని రక్షించి హీరోగా అయ్యాడు. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ ఎవరు? ఏంటీ అతడు చేసిన సాయం? ఇప్పుడు తెలుసుకుందాం.
పర్యాటకులకు షెల్టర్
జమ్ముకశ్మీర్ లో పహల్గాం ప్రాంతంలో ప్రకృతిని ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ముష్కర మూక (Pahalgam Terror Attack) ఒక్కసారిగా తెగబడిన సంగతి తెలిసిందే. తుపాకులతో కొండల నుంచి దూసుకొచ్చిన తీవ్రవాదులు.. గుంపులు గుంపులుగా ఉన్న పర్యాటకులపై విరుచుకుపడ్డారు. దీంతో ఏం జరుగుతుందో తెలిసే లోపే పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. మరికొందరు షాక్ నుంచి తేరుకొని తలో దిక్కు పరిగెత్తారు. అలా తప్పించుకు పారిపోతున్న పర్యాటకులకు కాశ్మీర్ కు చెందిన ముస్లిం ఆటో డ్రైవర్ ఆపన్నహస్తం అందించాడు. తన ఇంట్లో షెల్టర్ ఇచ్చి వారిని ఉగ్రవాదుల కాల్పుల నుంచి రక్షించాడు.
In a remarkable act of humanity, a Muslim driver from Kashmir sheltered a group of stranded tourists in his own home during a tense situation. The driver not only provided them with food and safety but also ensured their well-being until further help could arrive.#KashmirNews… pic.twitter.com/QP7KsXIjlz
— Pune Mirror (@ThePuneMirror) April 23, 2025
ఆహారం అందజేత
ఆపదలో ఉన్న పర్యాటకులకు షెల్టర్ ఇవ్వడమే కాకుండా వారికి ఆహారం అందించి సహాయపడ్డాడు ఆ ఆటో డ్రైవర్. ఉగ్రదాడి భయం నుంచి వారు తేరుకోవడంతో పాటు పరిస్థితులు చక్కబడే వరకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. దీంతో ముస్లిం ఆటో డ్రైవర్ సాయానికి కృతజ్ఞతలు అంటూ పర్యాటకులు ఓ స్పెషల్ వీడియోను సోషల్ పంచుకున్నారు. దీంతో అతడిపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. కష్టకాలంలో వారిని రక్షించి దేవుడిగా మారావంటూ పలువురు నెటిజన్లు ఆటో డ్రైవర్ ను ప్రశంసిస్తున్నారు.
Also Read: Nellore Man Killed in Attack: కాశ్మీర్ ఉగ్రదాడి.. ఏపీ వాసిపై బుల్లెట్ల వర్షం.. శరీరంలో 42 తూటాలు!
దేశవ్యాప్తంగా ప్రశంసలు
మరోవైపు కాశ్మీర్ ఆటోడ్రైవర్ చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఓవైపు పాకిస్తాన్ కు చెందిన ముస్లిం ఉగ్రవాదులు ప్రాణాలు హరిస్తుంటే.. భారత్ కు చెందిన అదే మతం వ్యక్తి ప్రాణాలను నిలబెట్టడాన్ని హైలెట్ చేస్తున్నారు. నిజమైన ముస్లిం ఎలా ఉండాలో ఈ ఆటో డ్రైవర్ చేసి చూపించాడని ఆకాశానికెత్తుతున్నారు. భారతీయ ముస్లింలు మతసామరస్యాన్ని ఎంతగా గౌరవిస్తారో చెప్పేందుకు ఈ ఘటన చక్కటి ఉదాహరణ అని పేర్కొంటున్నారు. అటు భారత్ కు చెందిన ముస్లిం మత పెద్దలు సైతం.. ఆటో డ్రైవర్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.