GHMC (imagecrdit:twitter)
హైదరాబాద్

GHMC: మూసారాంబాగ్ బ్రిడ్జి మార్చి కల్లా పూర్తి.. మరో రెండు బ్రిడ్జిల జీహెచ్ఎంసీ డెడ్ లైన్

GHMC: గ్రేటర్ వాసుల దాహర్తిని తీర్చే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు ఎగువనున్న చేవెళ్ల, వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావటంతో రిజర్వాయర్ల నుంచి మూసీ నదిలోకి ఇటీవలే భారీగా నీటిని విడుదల చేయటంతో మూసీ ఉగ్రరూపం దాల్చిన సంగతి తెల్సిందే. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రిజర్వాయర్ల నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయటంతో చాదర్ ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిలపై నుంచి వరద నీరు భారీగా ప్రవహించింది. ఫలితంగా మూసారాంబాగ్ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి సామాగ్రి సైతం కొట్టుకుపోయేలా వరద ప్రవహించింది. దీంతో ఇప్పటికే మూసారాంబాగ్ ప్రాంతంలోనున్న పాతకాలపు బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. తొలుత ఈ బ్రిడ్జికి స్టెబిలిటీ టెస్టులు నిర్వహించి, అవసరమైన రీపేర్లు చేసి స్టెబిలిటీని పెంచాలని తొలుత యోచించారు.

మూసారాంబాగ్ వద్ద ఇరు వైపులా..

కానీ స్టెబిలిటీ టెస్టులు నిర్వహించాలంటే బ్రిడ్జికి కొన్ని ఎలక్ట్రానిక్ డివైస్ లను అమర్చాల్సి ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు. కానీ బ్రిడ్జి ఇప్పటి వరకు బాగా తడిసి, నీరు కారుతున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ ఇంజనీర్లు స్టెబిలిటీ టెస్టులను నిర్వహించాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. మూసారాంబాగ్ వద్ద ఇరు వైపులా రాకపోకలు సాగించేందుకు వీలుగా రెండు వంతెనలను నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల వరదలకు బాగా దెబ్బతిన్న పాత బ్రిడ్జిని తిరిగి నిర్మించాలని, ఇందుకు వచ్చే జూన్ లోపు నిర్మాణం పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ ఇంజనీర్లు టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త బ్రిడ్జి పనులను వచ్చే మార్చి కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొత్త బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను చేపట్టిన సంస్థకు మార్చి కల్లా పూర్తి చేయాలన్న ఆదేశాలు సైతం జారీ చేసినట్లు సమాచారం. రానున్న ఏడాది కాలంలో ఈ రెండు బ్రిడ్జుల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది.

Also Read: Nagarjuna: కింగ్ నాగార్జునకు బిగ్ రిలీఫ్.. రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

మార్చి లోపు హెచ్ సిటీ పనులన్నీ ప్రారంభం

గ్రేటర్ లో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ సర్కారు సిటీలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులన్నీ వచ్చే మార్చి లోపు ప్రారంభించాలని ఇంజనీరింగ్ విభాగం టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తం అయిదు ప్యాకేజీలుగా రూ. 7032 కోట్లతో మొత్తం 23 ప్రాజెక్టులకు సర్కారు పరిపాలపరమైన ఆమోదం ఇవ్వటంతో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వింగ్ కేబీఆర్ చుట్టూ రూ. 1090 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆరు స్టీల్ బ్రిడ్జిలకు, ఆరు అండర్ పాస్ ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను చేపట్టి ఏజెన్సీలను ఎంగేజ్ చేసుకుంది. ఈ పనులను కూడా మార్చి లోపు ప్రారంభించాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఇంజనీరింగ్ విభాగానికి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వీటి పనులతో పాటు విప్రో జంక్షన్, నానల్ నగర్ మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ పనులకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను చేపట్టినా, ఈ పనులను కూడా మార్చి లోపు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

త్వరలో కంటోన్మెంట్ ప్రత్యామ్నాయ రోడ్ల పనులు షురూ

సికిందరాబాద్ లో రక్షణ శాఖ పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వాహనదారుల రాకపోకల కోసం సర్కారు ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రోడ్ల పనులకు కూడా టెండర్లు పూర్తయినట్లు, త్వరలోనే క్షేత్ర స్థాయిలో పనులు మొదలుకానున్నట్లు సమాచారం. బోర్డు పరిధిలో ప్రత్యామ్నాయ రోడ్ల కోసం చేసిన స్థల సేకరణకు పరిహారంగా శివారులోని జవహర్ నగర్ లోని రూ. 400 కోట్ల భూమిని రక్షణ శాఖకు ఇచ్చేందుకు దాదాపు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోవటం, టెండర్లు ఖరారు కావటంతో ఇక కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రూ. 960 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్రత్యామ్మాయ రోడ్ల ఏర్పాటు పనులు త్వరలోనే మొదలుకానున్నట్లు తెలిసింది.

Also Read: RV Karnan: ఉద్యోగులసేవలు మరువలేనివి.. కర్ణన్ కీలక వ్యాఖ్యలు

Just In

01

Cough Syrup Deaths: దగ్గు సిరప్ తాగి ఆరుగురు చిన్నారుల మృతి.. తీవ్ర విషాదం

Ramchander Rao: ఆ రెండు పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు: రాంచందర్ రావు

Investment Scam: అధిక లాభాల ఆశ చూపి కోట్లు దోచేస్తున్న ముఠా అరెస్ట్ .. ఎక్కడంటే?

MLC Kavitha: ఈటల రాజేందర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు!.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!

DGP Shivdhar Reddy: స్థానిక సంస్థల ఎన్నికలే నా మొదటి ఛాలెంజ్: డీజీపీ శివధర్ రెడ్డి