Nagarjuna: కింగ్ నాగార్జునకు బిగ్ రిలీఫ్ వచ్చింది. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన పేరు, ఇమేజ్, స్వరం, వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలను ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించకూడదని జస్టిస్ తేజస్ కారియా మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. ఏఐ ఫేస్ మార్ఫింగ్, డీప్‌ఫేక్‌ల వంటి టెక్నాలజీలతో తన వ్యక్తిత్వాన్ని అపవిత్రం చేస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. ఈ ఆదేశాలు సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు కొత్త మైలురాయిగా మారాయి. నాగార్జున తన పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిత్వ హక్కులు), పబ్లిసిటీ రైట్స్ (ప్రచురణ హక్కులు) రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పోర్నోగ్రాఫిక్ కంటెంట్, అనధికారిక మెర్చండైజింగ్, ఏఐ జనరేటెడ్ వీడియోల వంటి అనుమతి లేని ప్రచారాలు తన గుర్తింపును దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో మానిటైజ్ చేసి వ్యాప్తి చేస్తున్నారని, ఇది ఏఐ మోడల్స్ ట్రైనింగ్‌కు కూడా ఉపయోగపడుతోందని అభియోగం చేశారు. కోర్టు ఈ వాదనలను ఆమోదించి, వివిధ వెబ్‌సైట్లు, జాన్ డో (తెలియని వ్యక్తులు)లను ఆపమని ఆదేశించింది.
జస్టిస్ తేజస్ కారియా ఆదేశాల్లో ముఖ్యమైనవి: నాగార్జున పేరు, ఇమేజ్, లైక్‌నెస్, స్వరం లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించి, ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు. కమర్షియల్ లేదా పర్సనల్ గెయిన్ కోసం ప్రొడక్ట్స్ లేదా కంటెంట్‌ను క్రియేట్ చేసి, షేర్ చేయడం నిషేధం. ఏఐ, జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్‌ఫేక్స్, ఫేస్ మార్ఫింగ్ వంటి టెక్నాలజీలతో ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. డిఫెండెంట్ వెబ్‌సైట్లు పిటిషన్‌లో పేర్కొన్న URLలను 72 గంటల్లోపు రిమూవ్ చేయాలి. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్యూనికేషన్స్ (DoT)కు ఈ URLలను బ్లాక్ చేయాలని డైరెక్షన్స్ ఇవ్వాలని కోర్టు సూచించింది.
Read also-Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు.. మరీ అంత దారుణమా..
కోర్టు తీర్పులో పేర్కొన్నట్లుగా, “వ్యక్తిత్వ హక్కుల దుర్వినియోగం ఆర్థిక ఆసక్తులు, గౌరవంగా జీవించే హక్కు, రెప్యుటేషన్, గుడ్‌విల్‌కు హాని కలిగిస్తుంది. ఇది పబ్లిక్‌లో కన్ఫ్యూజన్‌కు దారితీస్తుంది. ఎండోర్స్‌మెంట్ లేదా అసోసియేషన్ గురించి తప్పుడు అర్థం కలిగిస్తుంది.” జస్టిస్ కారియా మాటల్లో, “ప్లెయింటిఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ప్రసిద్ధ వ్యక్తి. మిస్‌లీడింగ్, డిగ్రేడేటరీ, అతని గుడ్‌విల్, రెప్యుటేషన్‌ను దెబ్బతీస్తాయి.” బాలీవుడ్ స్టార్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అమితాభ్ బచ్చన్, అనిల్ కపూర్, ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహర్ వంటి వారూ ఇలాంటి కేసులు వేసి రిలీఫ్ పొందారు. నాగార్జున సోషల్ మీడియాలో కోర్టుకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. “డిజిటల్ యుగంలో నా పర్సనాలిటీ రైట్స్‌ను రక్షించిన ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు. సీనియర్ కౌన్సెల్ వైభవ్ గగ్గర్, ప్రవీణ్ ఆనంద్, వైషాలి, సోమ్‌దేవ్, విభావ్‌ల వాదనలకు ధన్యవాదాలు,” అంటూ చెప్పుకొచ్చారు.