Miyapur Crime: పెళ్లికి కారణమైన ప్రేమే.. చివరికి ప్రాణాల మీదకు
Miyapur Crime: ( iamge credit: free pic)
హైదరాబాద్

Miyapur Crime: పెళ్లికి కారణమైన ప్రేమే.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చిందా?

Miyapur Crime: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, అత్తపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం.. జనప్రియ నగర్ లో మహేష్ తన కుటుంబంతో కలిసి నివాసముంటూ.. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మహేష్ కొంతకాలం క్రితం శ్రీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Om Prakash murder case: మాజీ డీజీపీ దారుణ హత్య.. పక్కా స్కెచ్ తో లేపేసిన భార్య, కూతురు

కాగా గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో  మధ్యాహ్నం మహేష్ తన భార్య శ్రీదేవితో గొడవపడి విచక్షణారహితంగా కొట్టాడు. తన కూతుర్ని ఎందుకు కొడుతున్నావ్ అంటూ అడ్డుకోబోయిన మంగను సైతం కొట్టి, పంట గదిలోని కత్తితో ఇరువురిపై దాడి చేశాడు. దాడిలో గాయపడిన మంగ, శ్రీదేవి లను స్థానికగా ఉన్న ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

 

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు