Miss World 2025: హైదరాబాద్ దేశంలోనే అత్యంత సురక్షితమైన భద్రమైన నగరమని మరోసారి చాటుకుంది. ఇండియా పాకిస్థాన్ మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణంలో శనివారం హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ప్రశాంతంగా జరిగాయి. ప్రపంచ శాంతికి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు కూడా పాటుపడతాయని నిర్వాహకులు ప్రకటించారు. 110 దేశాల నుంచి వచ్చిన అందాల తారలతో పాటు, విదేశీ అతిథులకు తెలంగాణ ప్రభుత్వం మంచి ఆతిథ్యం తో పాటు, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించింది.
ప్రపంచమంతా ఈ ప్రారంభోత్సవ వేడుకలను ఆసక్తిగా తిలకించారు. దేశ విదేశాల్లో ఈ అందాల ఈవెంట్ ను కోట్లాది మంది వీక్షించారు. దాదాపు వెయ్యి మందికిపైగా వివిధ దేశాలకు చెందిన జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఈ ఈవెంట్ ను నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా కవర్ చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజీని ఈ వేడుకలు మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయి.
Also read: Miss World 2025: ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు.. ఆహా అనిపించిన అందాలు!
ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలతో పాటు భౌగోళికంగా, నైసర్గికంగా హైదరాబాద్ లో ఉన్న పర్యావరణం విదేశీ అతిథులను అమితంగా ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు తోడు పాశ్చాత్య దేశాల కల్చర్ మేలవింపుగా కార్యక్రమం కొనసాగింది.
శాంతి భద్రతలకు సురక్షితమైన నగరంగా హైదరాబాద్ మరోసారి దేశంలో మరోసారి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. అటు ఐటీ రంగం నుంచి ఇటు అందాల సామ్రాజ్యం వరకు అన్ని రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న సానుకూల అంశాలు. ఈ అవకాశాలన్నీ నెలరోజుల మిస్ వరల్డ్ వేడుకల ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించన్నాయి.