Minister Seethakka(image credit:X)
హైదరాబాద్

Minister Seethakka: టీచర్లకు ఏడాదికి రెండుసార్లు శిక్షణ.. మంత్రి కీలక నిర్ణయం!

Minister Seethakka: బంజారాహిల్స్ లోని కొమరం భీం ఆదివాసి భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అకాడమిక్ సక్సెస్ మీట్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. టెన్త్, ఇంటర్, ఎంసెట్, జేఈఈ ఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచిన గిరిజన విద్యా సంస్థల విద్యార్థులను మంత్రి సీతక్క సన్మానించారు. చదువులో సత్తా చాటిన గిరిజన విద్యార్థులకు, గిరిజన విద్యా సంస్థల సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

ఇతర విద్యార్థుల కన్నా గిరిజన విద్యా సంస్థల విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేలా పనిచేసిన టీచర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు ఎంతో కీలక మైనదని.. ట్రైబల్ ఏరియాల్లో చదువు లేకపోవడంతో మనల్ని చిన్న చూపు చూసారని అన్నారు. మనల్ని అక్షరానికి దూరం చేసి అనాగరికులనీ ముద్ర వేశారని కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ఇప్పుడు ప్రైవేట్ విద్యార్థులు తో గిరిజన ఆదివాసి విద్యార్థులు పోటీ పడుతున్నారు.

ఎస్టీలు అధికంగా ఉన్న ములుగు ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాలు టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానాల్లో నిలిచాయని తెలిపారు. విద్యకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, 8 ఏళ్ల తర్వాత డైట్ ఛార్జీలు, పదహారేళ్ల తర్వాత కాస్మొటిక్ ఛార్జీలు పెంచారని అన్నారు. ఎస్టీ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో గిరిజన విద్యా సంస్థల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతోందని అన్నారు.

Also read: Govt Whip Beerla Ilaiah: నోటిని యాసిడ్‌తో కడుగుతా.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ వార్నింగ్!

నిరక్షరాస్యత దశ నుంచి అక్షరాస్యత దశ దాటుకొని ఇప్పుడు రాష్ట్రానికి టాపర్స్ గా మారే దశకు చేరుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహకము, గురుకుల విద్యాసంస్థల సిబ్బంది సహకారంతో గిరిజన విద్యా సంస్థలు మంచి ఉతీర్ణత సాధించాయని అన్నారు. ఇతర విద్యాసంస్థలకన్నా, రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ మార్కులు సాధించాయని.. పది కంటే ఇంటర్ లో పాస్ శాతం తక్కువ ఉంది కాబట్టి ఇంటర్ పరీక్షల్లో అందరూ 90 శాతం మార్కులు సాధించేలా పని చేద్దామని అన్నారు.

మూస పద్ధతి లో చదువు లు వద్దని, విలువలు, వినయం, సంస్కారం, సామాజిక స్పృహ, సమానత్వ భావన నేర్పించేలా బోధించాలని అన్నారు. మంచి మార్కులు వస్తే గర్వం వద్దని విద్య తో ఎదగాలి వినయంతో మెలగాలి అని, అప్పుడే ఉన్నత శిఖరాలు చేరుకోగలరని మంత్రి అన్నారు. ఆదివాసీ గిరిజనులు తమ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవాలని సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంతో పాటు విద్యాసంస్థల్లో ఎస్టీల ప్రత్యేక సంస్కృతిని కాపాడాలని అన్నారు.

ఆదివాసి గిరిజనులో సాంస్కృతిక మార్పు జరగ కూడదని గిరిజన విద్యాసంస్థల్లో బోధిస్తున్న ఇతర వర్గాల టీచర్లు తమ సంస్కృతి సాంప్రదాయాలను గిరిజన విద్యార్థుల మీద రుద్ద వద్దు అంటూ మంత్రి హెచ్చరించారు. చదువుతోపాటు ఆదివాసి గిరిజన సాంప్రదాయాలు నేర్పించాలని బయట విద్యార్థులు తో గురుకుల విద్యార్థులు పోటీ పడాలని ఆదివాసి గిరిజన విద్యార్థులు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలని మన ప్రత్యేకత ను కోల్పోతే మన అస్తిత్వం కనుమరుగవుతుందని అన్నారు.

Also read: Notice to Sunitha Rao: మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావుకు షోకాస్ నోటిసులు..!

అది మన ఉనికికే ప్రమాదం అని మన అస్తిత్వం పోతే.. మన అభివృద్ధిని ఎవరూ పట్టించుకోరు కాబట్టి మనం ఎంత ఎత్తుకు ఎదిగిన మన మూలాల మరవద్దు.. అస్తిత్వం కోల్పోవద్దని అన్నారు. ట్రైబల్ అని ఎవరు చెప్పుకోరు సమాజం లో చిన్న చూపు చూస్తారు అనే భయం ఇప్పటి విద్యార్థులు లో ఉంది భయపడాల్సిన అవసరం లేదన్నారు.. మన జాతుల నుంచి ఐఏఎస్ లో ఐపీఎస్ లు ఉన్నారు.. ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు మనం ఎవరికీ తక్కువ కాదని కీలక వ్యాఖ్యలు చేసారు.

విద్య లో వస్తున్న మార్పులు చెప్పండని.. భాషా, సంప్రదాయం లు చెప్పాలని తెలిపారు. మంత్రిగా ఉన్న నేను ఈ శాఖ కు డాటర్ ని అని ఏ సమస్య ఉన్న నాతో చెప్పుకోవచ్చని అన్నారు. 2014 వరకు మన జాతుల మీద, గిరిజన సంస్కృతి మీద పరిశోధన జరిగింది.. గత పది సంవత్సరాల్లో మన సంస్కృతిపై అధ్యయనం పరిశోధన తగ్గిందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీడీఏలు నిర్వీర్యం అయ్యాయని ఐటీడీలను తిరిగి బలోపేతం చేయాలని సీఎం సూచించారని స్పష్టం చేసారు.

హాస్టల్స్ లో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు, తాతలు ఏం చేశారు అన్నది మరిచి పోవద్దని ఏ కోర్సులు కు డిమాండ్ ఉన్నాయో వాటిని నేర్పాలని సిబ్బందికి చెప్పారు. పది, ఇంటర్ తరువాత స్టూడెంట్స్ కి గైడెన్స్ దొరకట్లేదు.. డైట్ కాస్మొటిక్ ఛార్జీలు పెంచామని సన్న బియ్యం 50 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ధరలు పెంచిందని అన్నారు.

మా ఇంట్లో నేను ఒక్కతే అమ్మాయినని.. 100 మంది అక్కాచెల్లెళ్లను హాస్టల్ నాకు ఇచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మీటింగ్ లో నాకు చదువు చెప్పిన ఇద్దరు టీచర్లు వచ్చారు వారి ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయికి వచ్చానని.. నిత్య విద్యార్థి గా ఉండటంలో ఎంతో సంతృప్తి ఉంటుందని.. ఇపుడు 2వ ph.d కోసం ఎంట్రన్స్ రాశానని.. కొత్తది నేర్చుకోవాలి.. నేర్చుకున్నది పది మందికి పంచాలి అన్నదే నా ఫిలాసఫీ అని మనల్ని మనం గౌరవం పెంచుకోవాలని అన్నారు.

Also read: MM Keeravani: పవన్ కళ్యాణ్‌‌పై కీరవాణి సంచలన వ్యాఖ్యలు

అందుకే మొదటిసారిగా ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పురస్కారాలు అందుకున్న విద్యార్థులు తమ ప్రతిభను మరింత పెంచుకోవాలని ప్రతిభా పురస్కారాలు అందుకోలేక పోయిన విద్యార్థులు మరింత పట్టుదలతో చదవాలని తెలిపారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని, ఈ ఏడాది నుంచి ఏడాదికి 2 సార్లు టీచర్స్ కు శిక్షణ ఇస్తామని, పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో, దసరా, సంక్రాంతి మధ్యలో 2 సార్లు ట్రైనింగ్ ఇస్తామని అన్నారు.

దేశ భవిష్యత్తు నేటి విద్యార్థుల చేతుల్లో.. విద్యార్థుల భవిష్యత్తు టీచర్ల చేతిలో ఉందని అంతరాలు, అసమానతలు పోవాలంటే అంతా.. విద్యావేత్తలు కావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ సహకారంతో ఆదివాసి గిరిజన బిడ్డలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చదువు నాకు బతుకు నిచ్చిందని చదువు మూలంగానే నన్ను ప్రజలు గౌరవిస్తున్నారన్నారు.

ఉన్నత స్థానాలకు చేరుకునే గిరిజన విద్యాసంస్థల విద్యార్థులు.. సమాజానికి తిరిగి మీ సేవలందించాలి పే బ్యాక్ టు సొసైటీ అన్న సిద్ధాంతాన్ని ఆచరణలో చేసి చూపించాలని మంత్రి కోరారు. గురుకులాలు, గిరిజన విద్యా సంస్థల గౌరవాన్ని నిలబెట్టేలా విద్యార్థులు కష్టపడాలని, టెన్త్, ఇంటర్, ఎంసెట్ జేఈఈ మెయిన్స్ లో చక్కటి ప్రతిభ కనపరిచి స్టేట్ ర్యాంకర్స్ గా నిలిచిన గిరిజన గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను మంత్రి సీతక్క సన్మానించి, స్టేట్ ర్యాంకర్స్ కి సర్టిఫికెట్లు ప్రధానం చేసారు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు