Notice to Sunitha Rao: కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.తెలంగాణ మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావుకు ఏఐసీసీ మహిళ కాంగ్రెస్ షోకాస్ నోటిసులు జారీచేసింది. పార్టీ పదవుల విషయంలో ఆమే కొంతమంది మహిళా నేతలతో కలిసి గాంధీ భవన్‌లో టీపిసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట బైఠాయించి దర్నా చేపట్టారు.
గతంలో తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహకచరించడం లేదంటూ బహిరంగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో తాజాగా గోషామహాల్ కాంగ్రెస్ మహిళా నేతలు సునీతరావు వ్యవహారంపై పార్టీ హైకమాండ్‌కు లేఖలో ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఆమేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Rread: Shadnagar BJP party: బీజేపీ కార్యాలయం అద్దె చెల్లించక 40 నెలలు.. యజమాని ఆవేదన!
పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆల్కాలాంబా ఈరోజు సునీత రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులలో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సునీతా రావు షోకాజు నోటీసుల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి. హాట్ టాపిక్‌గా మారింది.