మేడ్చల్ స్వేచ్ఛ: Medchal News: శిఖంచెరువు భూమి కబ్జాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు బుధవారం తొలగించారు. స్వేచ్ఛ పత్రికలో గత నెల 30న ‘చిన్నదవుతున్న పెద్ద చెరువు’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గౌడవెల్లి గ్రామ రెవెన్యూ కి సంబంధించిన కొన్ని సర్వే నంబర్లలలోని భూమిలోకి వర్షాకాలంలో మేడ్చల్ పెద్ద చెరువు నిండినప్పుడు చెరువు నీళ్లు వచ్చి నిలుస్తున్నాయి.
అలా నిలిచిన నీరు కొన్ని నెలల వరకు ఆలాగే ఉంటున్నాయి. నీళ్లు నిలిచే వరకు ఉన్న భూమిలో గతంలో ఇరిగేషన్ అధికారులు హద్దులు పాతారు. ఆ హద్దులను పద్మావతి వెంచర్స్ డెవలపర్స్ యాజమాన్యం తొలిగించి, రెండు నెలలుగా రాత్రి పూట పెద్ద చెరువు శిఖం,ఎఫ్ టీఎల్‌ను పూర్తిగా మట్టితో పూడ్చుతున్నారు.
Rajiv Yuva Vikasam Scheme: నిరుద్యోగులూ.. అప్లై చేసుకున్నారా? కలెక్టర్ సమీక్ష
ఈ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని స్వేచ్ఛ పత్రిక ఎత్తి చూపింది. ఈ మేరకు బుధవారం అధికారులు స్పందించి జేసీబీ సాయంతో ఎఫ్‌టీఎల్, శిఖం భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు