Rajiv Yuva Vikasam Scheme: నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజీవ్ వివ వికాసం పథకంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తులు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్స్ , మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డిపిఎంలు, ఏపీఓలు, తదితర అధికారులతో కలిసి రాజీవ్ యువ వికాసం పథకం అమలు, త్రాగునీరు సరఫర, ఎన్ఆర్ఈఆర్జిఎస్, పెన్షన్స్, సేర్ఫ్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
అంతకుముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకం ద్వారా జిల్లాలో నిరుద్యోగులైన యువతీ, యువకుల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించి అందరికి తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్యాలయాలు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాలు, ప్రదేశాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలన్నారు.
Also Read: Sri Rama Navami: శ్రీరామనవమి కి భద్రాచలం వెళ్తున్నారా.. ఈ రూల్స్ పాటించాల్సిందే
మండల స్థాయిలో సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
దరఖాస్తుదారులకు పూర్తి గైడ్ చేయుటకు సిబ్బంది నియమించాలని సూచించారు. జిల్లా ప్రత్యేక అధికారులు ఉదయం,సాయంత్రం రాజీవ్ యువ వికాసం పై నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లాలో త్రాగునీటి సరఫరాకు ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, గత సంవత్సరం, ఈ సంవత్సరం వేసవికాలం యాక్షన్ ప్లాన్ ప్రకారం మున్సిపల్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఎంపీడీవోలు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకు త్రాగునీరు అందించుటకు సిద్ధంగా ఉండాలని సూచించారు. త్రాగునీరు సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి స్థానిక సోర్స్ ద్వారా సరఫరా చేయాలని అన్నారు. రానున్న ఒకటి రెండు మాసాలలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
Also Read: Vanasthalipuram FCI Colony: నిధులు తెచ్చింది మేము.. శంఖుస్థాపన మీదా? కార్పొరేటర్ ఫైర్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, సెర్ఫ్ పెన్షన్, సదరం, యూడిఐడి పోర్టల్ ద్వారా సర్టిఫికెట్లు తదితర అంశాలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు వేగంగా సేవలను అందించాలన్నారు. జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు రేపటినుండి ప్రత్యేక కార్యచరణ ప్రకారము రాజీవ్ యువ వికాసం పథకం, త్రాగునీరు సరఫర, తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి ఉదయం సాయంత్రం నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
Also Read: CM Relief Fund: పేదల కోసమే.. సీఎం సహాయనిధి.. ఎమ్మెల్యే మురళీ నాయక్
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు, (రెవెన్యూ),లెనిన్ వత్సల్ టోప్పో, కె.వీర బ్రహ్మచారి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జెడ్పి సీఈఓ పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు నరసింహస్వామి, శ్రీనివాస్, దేశి రామ్, మండల ప్రత్యేక అధికారులు మరియన్న, సురేష్, శ్రీమన్నారాయణ, విజయనిర్మల, ఇరిగేషన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు