Sri Rama Navami [ image credit: twitter]
తెలంగాణ

Sri Rama Navami: శ్రీరామనవమి కి భద్రాచలం వెళ్తున్నారా.. ఈ రూల్స్ పాటించాల్సిందే

 Sri Rama Navami: భద్రాచల రామాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ నవమికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టెంట్లను, చలువ పందిళ్లతో పాటుగా కూలర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివిఐపి గ్యాలరీ,వీఐపీ గ్యాలరీలను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తారన్నారు. మిథిలా స్టేడియానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, భక్తులకు దర్శనం చేయించడం మా బాధ్యతని మంచినీళ్లు, మజ్జిక ప్యాకెట్లు ఐటిసి, ఆర్డబ్ల్యూఎస్ వారి సహకారంతో అందిస్తామన్నారు.

 Also Read: Adilabad news: కమ్మనైన అమ్మ ప్రేమ కోసం.. ఓ చిన్నారి సాహసం..

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తుల రద్దీ దృష్ట్యా అసౌకర్యం కలగ కుండా తగినన్ని మూత్రశాలలు ఏర్పాటు చేశామన్నారు.భక్తులు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, సింగల్ ప్లాస్టిక్ అసలు వాడో ద్దని, క్లాత్ బ్యాగ్స్ వాడాలని, ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

 Also Read: Swami Nithyananda: నిత్యానంద చనిపోలేదు.. కైలాస దేశం ప్రకటన

దేవాలయాన్ని పరిశుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మన భద్రాచలాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ భక్తులను కోరారు.ఈ కార్యక్రమంలో ఐపిఎస్ రోహిత్ రాజ్, ఐటిడిఏ పిఓ రాహుల్, ఆర్డీవో , ఈవో రమాదేవి. పట్టణ సిఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది