మహబూబాబాద్ స్వేచ్ఛ: CM Relief Fund: తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలను ఆర్థికంగా ఆదుకునేందుకే సీఎం సహాయ నిధి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి, గూడూరు, మహబూబాబాద్ పట్టణానికి, చెందిన వివిధ గ్రామాలకు సంబందించిన 205 మంది బాధితులకు ప్రభుత్వం నుండి మంజూరైన రూ.56, లక్షల 6000 విలువైన సీఎం సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
Also Read: Fake Maize Seeds: రైతన్నకు భరోసా దక్కేనా? ఆశలన్నీ ఆ సమావేశంపైనే!
ఈ సందర్భంగా శాసనసభ్యులు మురళి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పని చేస్తుందన్నారు. ముఖ్యంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, వైద్య చికిత్సల కోసం, అత్యవసర సమయంలో ఆర్థిక సహాయం అవసరమైన సందర్భాల్లో సీఎం సహాయనిధి పథకం ద్వారా సాయాన్ని అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
సీఎం సహాయనిధి పథకం, కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, సంక్షోభ సమయాల్లో ప్రజలకు ఆశాకిరణంగా ఉంటుందన్నారు. ఈ నిధి ద్వారా అనేక కుటుంబాలకు జీవనోపాధి కోసం మద్దతు లభిస్తోందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు,మాజీ కౌన్సిలర్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: Kisan Yatra: రైతుల కోసం సరికొత్త యాత్ర.. ఊరూరా స్పెషల్ డ్రైవ్.. ఎందుకంటే?