Vanasthalipuram FCI Colony [ image credit: twitter]
హైదరాబాద్

Vanasthalipuram FCI Colony: నిధులు తెచ్చింది మేము.. శంఖుస్థాపన మీదా? కార్పొరేటర్ ఫైర్

Vanasthalipuram FCI Colony: వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఎఫ్​సీఐ కాలనీ ఫేజ్​–2 లో తాను శాంక్షన్​చేయించిన యూజీడీ పనులకు, తనకు సమాచారం లేకుండానే ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి శంకుస్థాపన చేయడమేమిటని డివిజన్​కార్పొరేటర్​ రాగుల వెంకటేశ్వర్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  వెంకటేశ్వర్​రెడ్డి తన నివాసంలో కాంగ్రెస్​పార్టీ డివిజన్​ప్రెసిడెంట్​కుట్ల నర్సింహ్మ యాదవ్​, వ్యవసాయ మార్కెట్​ కమిటీ డైరెక్టర్లు నేలపాటి రామారావు, అశోక్​గౌడ్​, నర్సింహ్మ గౌడ్​,సాయికిరణ్​లతో కలిసి ప్రెస్​మీట్​నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనస్థలిపురం డివిజన్ లోని ఎఫ్​సీఐ కాలనీ నుంచి ఆర్టీసీ కాలనీ వరకు యూజీడీ పైప్​లైన్​ నిర్మాణానికి కాంగ్రెస్​పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి మధుయాష్కీ గౌడ్​సహకారంతో వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డికి విన్నవించి తన లెటర్​ప్యాడ్​మీద రూ.55 లక్షలు శాంక్షన్​చేయించానన్నారు. త్వరలో జిల్లా ఇన్​చార్జి మంత్రి శ్రీధర్​బాబును పిలిచి డివిజన్​లో సుమారు రూ.12 కోట్ల అభివృద్ధి పనులకు ఒకేసారి శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

Raghurama Krishnam Raju: విచారణకు ప్రభావతి సహకరించాల్సిందే.. రఘురామ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు

కానీ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి అభద్రతా భావంతో.. దిగజారుడు రాజకీయాలు చేస్తూ.. కనీసం ప్రొటోకాల్​పాటించకుండానే కొబ్బరి కాయలు కొట్టడం దుర్మార్గమన్నారు. సుధీర్​రెడ్డి అన్ని డివిజన్ లలో వలే వనస్థలిపురంలో రాజకీయం చేస్తా.. అంటే ఊరుకునేది లేదని వెంకటేశ్వర్​రెడ్డి మండిపడ్డారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆయన చిల్లర రాజకీయాలు మానుకుని, హుందాగా వ్యవహరించాలని వెంకటేశ్వర్​రెడ్డి హితవు పలికారు. రేపటి నుంచి ఆయన బండారాలు ఒక్కొక్కటిగా బయటపెడతామని హెచ్చరించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?