Medchal ACB Raids( IMAGE CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Medchal ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి

Medchal ACB Raids: ఓ వెంచర్ నిర్వాహకుల నుండి లంచం తీసుకుంటుండగా ఎల్లంపేట్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ రాధకృష్ణ రెడ్డి (Radhakrishna Reddy) ఏసీబీ అదికారులకు (Medchal ACB Raids) చిక్కారు. ఈ సందర్బంగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఎల్లంపేట్ మున్సిపల్ లో గంగస్తాన్ హెచ్ఎండిఎ తో లే అవుట్ ఉన్న నిర్వాహకుల వద్దకు వెల్లి మీ లేఅవుట్ గోడ, గేట్ కూడా కూలగొట్టేస్తానని బెదిరించారని చెప్పారు. గోడ, గేట్ కూలగొట్టొద్దంటే తనకు 5 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో లేఅవుట్ నిర్వాహకుల వద్ద వారం రోజుల క్రితం లక్ష రూపాయలు అడ్వాన్స్ గా తీసుకోవడం జరిగిందని మిగతా 4 లక్షలు కూడా ఇవ్వాలని అడగడంతో లేఅవుట్ నిర్వాహకులు ఏసీబీ ను ఆశ్రయించారని చెప్పారు.

Also Read: Gadwal District: బీ అలర్ట్ భారీ వర్షాలకు తెగిపోయిన వాగు.. అక్కడ రాకపోకలు బంద్..?

పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు నిఘా

లేఅవుట్ నిర్వాహకులు 3 లక్షల 50 వేలు ఇస్తాము, మిగతా 50 వేలు తరువాత ఇస్తామని చెప్పడంతో, 3లక్షల 50 వేలు  ఉదయం కొంపల్లిలోని రాయచందని మాల్ వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వమని టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ చెప్పారని తెలిపారు. ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో నిఘా వేసి రాధాకృష్ణ తన కారుతో పాటు డబ్బులు పట్టుకున్నట్లు వివరించారు.రాధాకృష్ణరెడ్డి ఎడమ చేతి తో డబ్బులు ఉన్న బ్యాగ్ ను తాకి కారు దశ బోర్డు లో పెట్టుకున్నాడని, టెస్టులో కూడా పాజిటివ్ గా వచ్చిందన్నారు.

1064 ట్రోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి

డబ్బులు తీసుకునేందుకు వాడిన కారును కూడా సీజ్ చేసి రాధాకృష్ణరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఏసీబీ (ACB) డీఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఎల్లంపేట్ నుండి మొదటి ఫిర్యాదు వచ్చిందన్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేరని, మున్సిపల్ కమిషనర్ రావాలని సీనియర్ ఆఫీసర్లకు కబురు పెట్టామన్నారు. ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉండే 1064 ట్రోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాధుపై చర్యలు తప్పక తీసుకోవడం జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ పేర్కొన్నారు.

Also Read:Lokah Chapter 2: ‘కొత్త లోక చాప్టర్ 2’పై అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో!

Just In

01

DGP Shivadher Reddy: మహిళల భద్రతకు పటిష్ట చర్యలు.. నూతన డీజీపీ కీలక వాఖ్యలు

Kalyana Lakshmi Scheme: నిరుపేద ఆడబిడ్డలకు.. కల్యాణలక్ష్మి పథకం ఒక వరం

Techie Resign: ఏడాదికి రూ.12 లక్షల వేతనం.. జాబ్‌లో చేరిన 9 రోజులకే రిజైన్.. ఎందుకో తెలుసా?

Varalaxmi Sarathkumar: తన సోదరి పూజా శరత్ కుమార్‌తో వరలక్ష్మి చేస్తున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్!

Jogulamba Temple: జోగులాంబ సన్నిధిలో.. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు