Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాకాలంలో వర్షాలు కురిసే చాలు తరచుగా పలు మండలాలలో ప్రవహించే వాగులపై బ్రిడ్జి నిర్మాణాలకు నోచుకోకపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మట్టి రోడ్లు సైతం కోతకు గురై ప్రయాణించాలంటే వాయిదా వేసుకునే పరిస్థితి దాపురిస్తోంది. ఉమ్మడి ధరూర్(Tharurr) మండలం నీళ్లహళ్లి పాతపాలెం గ్రామాల మద్య వాగు వర్షం వచ్చినప్పుడల్లా ఉధృత్తంగా ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలల వ్యవధిలో తాత్కాలిక మట్టిరోడ్డు తెగిపోవడం వాగు ఉధృత్తంగా ప్రవహించడం ఆనవాయితీగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు నీళ్లహళ్లి, పాతపాలెం గ్రామాల మద్య ఉన్న వాగుపై బ్రిడ్జీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బ్రిడ్జీ నిర్మాణ పనులు చేపట్టడంతో వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. దీంతో ఉప్పేర్, నెట్టెంపాడు, నీళ్లహళ్లి, పాతపాలెం , వెంకటాపురం గ్రామాల ప్రజలు తాత్కలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పై రాకపోకలు కొనసాగిస్తున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా నీళ్లహళ్లి వాగు వద్ద వరద ఉధృత్తంగా ప్రవహించడంతో తాత్కాలిక రోడ్డు పై రాకపోకలు ఇబ్బందిగా మారాయి.
వర్షం వస్తే ఇక అంతే సంగతి..
వర్షం వస్తే చాలు వంతెన తెగిపోవడం పునరావృతం కావడంతో పలు గ్రామాల ప్రజలు పాలకులు, అధికారుల పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్లు కావొస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం పాలకులు, అధికారుల పనితీరుకు నిదర్శనం అని మండిపడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినా ఇప్పటివరకు పూర్తి చేయకుండా అట్టి సమస్యలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మానవపాడు మండలానికి సమీపంలోని పెద వాగు సైతం ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఐజ మీదుగా ఎమ్మిగనూరుకి అంతర్రాష్ట్ర రహదారికి మేడికొండ(Medikonda) సమీపంలో పోలోని వాగు సైతం ఉదృతంగా ప్రవహిస్తోంది.
జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి(RamChendra Reddy) వాగును పరిశీలించారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటారని, ఇలాంటి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిని కాంట్రాక్టర్ కు సకాలంలో బిల్లులు చెల్లించక పోవడంతో పనులను నిలిపి వేశారని, సత్వరమే ప్రభుత్వం స్పందించి వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐజ మీదుగా కర్నూల్ కి వెళ్లే ప్రధాన రహదారి అయిన హైజాక్ సమీపంలోని పెద్ద వాగు పైప్ లైన్ పలిగి గుంత ఏర్పడడంతో ఐజ ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి మరమ్మతులు చేయించారు.
Also Read: Gold Rate Today: అమ్మ బాబోయ్.. నేడు మరింతగా పెరిగిన గోల్డ్.. షాక్ లో మహిళలు?
బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేనా..
చుట్టూ ఉన్న అయిదారు గ్రామాలకు వెళ్లాలంటే నీళ్లహళ్లి పాతపాలెం గ్రామాల మద్య ఉన్న బ్రిడ్జి మార్గమే దిక్కు. కానీ, వానాకాలం వస్తే మాత్రం ఆ బ్రిడ్జిపై రాకపోకలు సాగించాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. ఏడాది క్రితం వాగుపై బ్రిడ్జినిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడంతో ఆ గ్రామ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారుమ బ్రిడ్జీ నిర్మాణ పూర్తై వాగుపై రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అందరూ అనుకున్నారు కాని…రెండేండ్లు కావొస్తున్న నీళ్లహళ్లి వాగుపై నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. బ్రిడ్జీ నిర్మాణానికి పనులు ప్రారంభించిన ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం ఆ గ్రామ ప్రజలకు శాపంగా మారింది.
భారీ వర్షాలకు వాగు ఉధృత్తంగా ప్రవహించడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడం అధికారులు కంటితుడుపు చర్యగా తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని మండలంలోని నెట్టెంపాడు, నీళ్లహళ్లి, పాతాపాలెం, ఈర్లబండ తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పంది.
Also Read: OTT Movie: వైరస్‌తో ప్రపంచం నాశనమైన 28 ఏళ్ల తర్వాత.. ఏం థ్రిల్ ఉంది గురూ..