28-Years-Later( image :X)
ఎంటర్‌టైన్మెంట్

OTT Movie: వైరస్‌తో ప్రపంచం నాశనమైన 28 ఏళ్ల తర్వాత.. ఏం థ్రిల్ ఉంది గురూ..

OTT Movie: 2002లో వచ్చిన ’28 ఇయర్స్ లేటర్’ సినిమా అంతకుముందు సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం. రేజ్ వైరస్ ప్రపంచాన్ని దెబ్బతీసిన 28 ఏళ్ల తర్వాత కథ. బ్రిటన్‌లోని ఓ ద్వీపంలో వైరస్ నుంచి తప్పించుకున్న కొంతమంది జీవిస్తున్నారు. హీరో జేమీ (ఆరోన్ టేలర్-జాన్సన్) తన 12 ఏళ్ల కొడుకు స్పైక్‌తో కలిసి బతుకుతూ, వేటకు మెయిన్‌ల్యాండ్‌కు వెళ్తారు. అక్కడ జాంబీలు, ప్రత్యేకించి ‘ఆల్ఫా’ అనే శక్తివంతమైన జాంబీతో ఎదుర్కొంటారు. తిరిగి ద్వీపానికి చేరుకోవడం, కుటుంబ బంధాలు, భయం, కోపం, ప్రేమ – అన్నీ కలిసి ఉంటాయి. జోడీ కోమర్, ఆల్ఫీ విలియమ్స్ కూడా కీలక పాత్రల్లో నటించారు. కథ మంచి ఎంగేజింగ్ గా సాగుతుండటంతో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

Read also-New Liquor Shops: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల..ఈ రూల్స్ ప్రకారమే కేటాయింపులు పూర్తి వివరాలు ఇవే?

ప్లస్ పాయింట్స్

దర్శకత్వం & విజువల్స్: డేనీ బోయెల్ దర్శకత్వంలో ఈ సినిమా అంబిషస్‌గా ఉంది. ఐఫోన్‌తో కొన్ని షాట్‌లు తీశారట, అది కూడా ఫ్రెష్ లుక్ ఇచ్చింది. గ్రూసమ్ సీన్స్, స్ట్రైకింగ్ విజువల్స్ హారర్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటాయి.

పెర్ఫార్మెన్సెస్: ఆరోన్ టేలర్-జాన్సన్, జోడీ కోమర్ పెర్ఫార్మెన్స్ బాగుంది. థీమాటిక్ డెప్త్, ఎమోషనల్ లేయర్స్ సినిమాని డీప్‌గా చేశాయి. సర్వైవల్, అంగర్, ఫియర్, లవ్ – ఇవన్నీ టచింగ్‌గా చూపించారు.

యూనిక్ అప్రోచ్: జస్ట్ జాంబీ హారర్ కాదు, ఫ్యామిలీ డ్రామా, స్పిరిచ్యువల్ థ్రెడ్, హ్యూమర్ కలిపి ఉంది. ఒరిజినల్ మూవీ ఫ్యాన్స్‌కి రిమినిసెంట్‌గా ఉంటుంది.

Read also-Anaganaga Oka Raju promo: ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి ప్రోమో చూశారా.. యాడ్ అనుకుంటే పొరపాటే..

మైనస్ పాయింట్స్

పేసింగ్ & స్టోరీ:  కొందరు డిస్‌జాయింటెడ్ అని, మల్టిపుల్ ఫిల్మ్స్ లాగా ఉందని అంటున్నారు. స్లగ్గిష్ పేసింగ్, షేకీ క్యారెక్టర్ మోటివేషన్స్ కొంచెం డల్ చేస్తాయి.

ఎక్స్‌పెక్టేషన్స్:  ఒరిజినల్ మూవీ లాగా రా హారర్ ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసపాయింట్ అవుతారు. టోనల్, విజువల్, డ్రామాటిక్‌గా ఇన్‌కోహెరెంట్ అని కొందరు కామెంట్ చేశారు.

టెక్నికల్ అస్పెక్ట్స్: సినిమాటోగ్రఫీ & సౌండ్: బ్యూటిఫుల్ షాట్స్, గ్రేట్ ఎడిటింగ్, మ్యూజిక్ – ఎనర్జీ ఎప్పుడూ డౌన్ కాదు.

స్పెషల్ ఎఫెక్ట్స్:  ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ గొప్పగా ఉన్నాయి, విసెరల్ ఫీల్ ఇస్తాయి.

వెర్డిక్ట్: హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్, ముఖ్యంగా ’28 డేస్ లేటర్’ లవర్స్‌కి ఈ సినిమా మిస్ చేయకూడదు. భయంతో పాటు ఎమోషనల్ డెప్త్ ఉంది, కానీ పేసింగ్ కొంచెం స్లోగా ఉంటే బోర్ కొట్టవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది.

రేటింగ్: 3.5/5

Just In

01

Balmoor Venkat: కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన కామెంట్స్

Dussehra Holidays 2025: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ప్రకటన.. ఎన్ని రోజులంటే?

Madharaasi OTT: హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Workers Protest: జీతాలు రాక‌ యాత‌న ప‌డుతున్నా కార్మికులు.. బ‌కాయిలు ఇస్తారా? బిచ్చ‌మెత్త‌కోమంటారా?

Paytm: భారీ గుడ్ న్యూస్.. వారికీ ఇక బంగారమే బంగారం!