Anaganaga Oka Raju promo: ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి ప్రోమో
naveen-polisetti( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Anaganaga Oka Raju promo: ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి ప్రోమో చూశారా.. యాడ్ అనుకుంటే పొరపాటే..

Anaganaga Oka Raju promo: టాలీవుడ్‌లో తన ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసులు ఆకర్షించిన యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి మళ్లీ ప్రేక్షకులను నవ్వించడానికి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో స్క్రీన్ పైకి రానున్నాడు. ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, పెళ్లి సీజన్‌కు సరిపడేలా రొమాంటిక్ కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన కథను కలిగి ఉంది. అనేక సవాళ్లను ఎదుర్కొని ‘అనగనగా ఒక రాజు’ 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన సంక్రాంతి ప్రోమో ను విడుదల చేశారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో హీరో, హీరోయిన్ లు ఇద్దరే కనిపించినా తరచుగా వచ్చే అన్ని ఫ్రోమోలు లాగా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది.

Read also-NATO on PM Modi: ప్రధాని మోదీపై నాటో చీఫ్ సంచలన ఆరోపణలు

ప్రోమో..

ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉంటుందని స్పస్టమైంది. అయితే దానికి తగ్గట్టుగా ప్రోమో ను సిద్ధం చేశారు నిర్మాతలు. ప్రోమో చూస్తుంటే.. హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒంటి నిండా నగలు వేసుకుని నమస్కారం నేను వేసుకున్న ఈ బంగారం 24 క్యారెట్స్ జీరో పర్నెంట్ వేస్టేజ్ అంటూ చెబుతుంది. అంతలో హీరో నవీన్ పొలిశెట్టి ప్రేమ్ లోకి ఎంటరరై ఇది నగలు యాడ్ కాదమ్మా ‘అనగనగా ఓ రాజు’ సంక్రాంతి ప్రోమో అంటాడు. దానికి హీరోయిన్.. నేను ఇంత నగలు వేసుకుంటే నాకు అవే గుర్తోస్తాయి ఏం చెయ్యను అంటుంది. దానికి నవీన్ ఆ నగలంతా తీసుకుని తాను వేసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ చెప్పాల్సింది చెబుతోంది. ఇలా మొదలవుతోంది, ప్రోమో చివరకు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పడానికి ఈ ప్రోమో విడుదల చేశారు నిర్మాతలు. దీనిని చూసిన నవీన్ పొలిశెట్టి అభిమానులు ఈ సంక్రాంతికి ఈ సినిమా చూసిన వారంతా నవ్వుకొవడం ఖాయం అంటూ కితాబు ఇస్తున్నారు.

Read also-Bathukamma Celebrations: వేలాదిమంది జానపద కళాకారులతో.. 30న ట్యాంక్ బండ్ పై బతుకమ్మ సంబురాలు

ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్ర ‘రాజు’గా నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ ఒక అహంకార రాజు గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. పెళ్లి సంబరాలకు సిద్ధమవుతూ హాస్యాస్పదమైన సంఘటనల్లో చిక్కుకునే వాళ్లు. హీరోయిన్ పాత్రలో మీనాక్షి చౌదరి నవీన పొలిశెట్టికి జంటగా నటిస్తోంది. ఆమె ఫ్రెష్ ఎంట్రీతో ఈ కామెడీకి రొమాన్స్ టచ్ ఇస్తుందని అంచనా. ముందు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ మూవీ, మార్పులతో మారి చేతికి చేరింది. నిర్మాణం సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్‌లో ఎస్. నాగవంశీ ప్రొడ్యూసర్‌గా, శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో జరుగుతోంది. సంగీత దర్శకుడిగా మిక్కీ జె. మేయర్ స్వరాలు సమకూర్చనున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే ఈ సినిమాపై భరీ అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది. అయితే అదే సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్ కూడా రావడంతో రాబోయే సంక్రాంతి ఎవరిది అవుతోందో చూడాలి మరి.

Just In

01

Suicide Case: title: నిజామాబాద్ జిల్లాలో దారుణం.. ఆసుపత్రి బాత్రూమ్‌లో ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్!

Musi Rejuvenation Project: మూసీ ప్రక్షాళన పక్కా.. మార్చిలో పనులు స్టార్ట్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన

Pawan Impact: పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా రేంజ్ అలాంటిది మరి.. నిధి అగర్వాల్ ఏం చెప్పారంటే?

Mana Doctor Babe: శ్రీ స్కంద ‘మన డాక్టర్ బాబే’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ వచ్చేశాయి.. ఎలా ఉందంటే?

KTR: క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప.. ప్రజల జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్