Hyderabad Fire Accident: పాతబస్తీ శాలిబండలో రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్టుగా సమాచారం. చార్మినార్ నుంచి అలియాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో కొన్నేళ్లుగా గోమతి ఎలక్ట్రానిక్స్ షో రూం నడుస్తోంది. ఎప్పటిలానే వ్యాపార లావాదేవీలు ముగిసిన తర్వాత షాప్ యజమాని దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాడు. కాగా, రాత్రి 10.30 గంటల సమయం దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన ఓ కారు గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్ ముందు మంటల్లో పేలి పోయింది.
మంటలు ఆర్పే యత్నం
ఈ ప్రమాదంలో ఎగిసిన మంటలు దుకాణానికి వ్యాపించాయి. చూస్తుండగానే నాలుకలు చాచి విస్తరించిన అగ్ని కీలలు దుకాణం మొత్తం విస్తరించాయి. వెంటనే స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేశారు. అయితే, మంటలు అంతకంతకూ ఎగిసి భవనం రెండో అంతస్తుకు ఎగబాకాయి. పక్కనే ఉన్న దుస్తుల దుఖానానికి కూడా వ్యాపించాయి. దాంతో అధికారులు మరో ఎనిమిది ఫైర్ ఇంజన్లను అక్కడికి రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, రాత్రి 12గంటల సమయానికి కూడా మంటలు అదుపులోకి రాలేదు.
Also Read: Hyderabad Fire Accident: సిద్దిఅంబర్ గోల్ మసీదు ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం..!
ప్రమాదమా? కుట్రా?
కాగా, జరిగింది ప్రమాదమా?.. కుట్రనా? అన్న అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాథమిక విచారణలో వేగంగా దూసుకొచ్చిన కారు షాప్ ముందు పేలిపోవడం వల్లనే భారీ అగ్నిప్రమాదం జరిగినట్టుగా వెళ్లడైంది. దీంట్లో కారు పూర్తిగా తగలబడగా ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తున్నా.. మిగతా ఇద్దరి ఆచూకీ తెలియలేదు. ఇటీవల ఢిల్లీలో కారుతో ఆత్మాహుతి దాడి జరిగిన నేపథ్యంలో ఇది కూడా అలాంటి సంఘటననేనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ అధికారులతో మాట్లాడగా జరిగింది ప్రమాదమే అని చెబుతున్నారు. విచారణ పూర్తి అయితే అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు.
Also Read:Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో తీరని విషాదం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృత్యువాత
