Cyberabad police: సైబరాబాద్కమిషనరేట్పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసుల (Cyberabad police) దాడులు జరిపి, పెడ్లర్లను అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ రితిరాజ్ ఎస్‌వోటీ డీసీపీ శోభన్‌కుమార్, మియాపూర్ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘శేరిలింగంపల్లి బాపూనగర్ నివాసి దేవర హరీష్(28) వృత్తిరీత్యా కూలీ. తన కజిన్ అరుణ్బెంగళూరులో ఉంటున్నాడు. అప్పుడప్పుడు హరీష్అక్కడికి వెళ్లేవాడు. అరుణ్‌కు డ్రగ్స్సేవించే అలవాటు ఉంది. హరీష్‌కు అరుణ్ మాదక ద్రవ్యాలను రుచి చూపించాడు. దాంతో హరీష్కూడా ఎండీఎంఏ డ్రగ్‌కు బానిసయ్యాడు.
డ్రగ్స్‌దందా చేయటానికి సిద్ధం
ఇలా బెంగళూరుకు వెళ్లి వస్తున్న క్రమంలో తేలికగా డబ్బు సంపాదించటానికి ఎండీఎంఏ డ్రగ్‌ను హైదరాబాద్ (Hyderabad) తీసుకొచ్చి అమ్మాలని హరీష్నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని స్నేహితులైన బాపూనగర్నివాసి కుంచల సాయికృష్ణ (28), గుంజి సాయి మణికంఠ (24)తో చెప్పగా, వాళ్లు కూడా డ్రగ్స్‌దందా చేయటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి డబ్బు జమ చేశారు. అనంతరం బెంగళూరు వెళ్లిన హరీష్…అరుణ్ ద్వారా 15 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్కొని హైదరాబాద్ తీసుకొచ్చాడు. అనంతరం ముగ్గురు కలిసి చందానగర్ డొయెన్స్కాలనీ రోడ్డులోని హైటెక్స్బావర్చీ హోటల్ పాన్షాప్వద్ద గ్రాము రూ.10 వేలకు విక్రయించటానికి ప్రయత్నించారు. ఈ మేరకు సమాచారం అందటంతో మాదాపూర్ ఎస్వోటీ అధికారులు, చందానగర్ పోలీసులతో కలిసి దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 గ్రాముల ఎండీఎంఏతో పాటు 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు’’ అని వివరించారు.
కల్లు డిపో నిర్వాహకుడి అరెస్ట్
పక్కాగా అందిన సమాచారం మేరకు కల్లు డిపో నడుపుతున్న వ్యక్తిని మాదాపూర్ఎస్వోటీ అధికారులు, చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 1.270 కిలోల ఆల్ఫ్రాజోలెంను స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ వేమనరెడ్డి కాలనీకి చెందిన గౌండ్ల బాలమురళీ కృష్ణ (38) మెదక్‌జిల్లా దౌల్తాబాద్‌లో కల్లు డిపో నడుపుతున్నాడు. ఈ క్రమంలో కల్తీ కల్లు తయారు చేసేందుకు సుధాకర్సహాయంతో రవితేజ అల్ఫ్రాజోలెం కొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ సమాచారం అందటంతో ఎస్‌వోటీ అధికారులు, చందానగర్ పోలీసులతో కలిసి అతడి ఇంటిపై దాడి చేశారు. తనిఖీలు చేసి ఆల్ప్రాజోలెంను సీజ్‌చేశారు. బాలమురళీ కృష్ణను విచారించగా మెదక్‌జిల్లా పోచంపల్లికి చెందిన రవితేజ నుంచి రూ.3 లక్షలకు కిలో చొప్పున ఆల్ప్రాజోలెం కొని కల్తీ కల్లు తయారీకి ఉపయోగిస్తున్నట్టు వెల్లడించాడు. దీంట్లో సాయి సుధాకర్ తనకు సహకరిస్తున్నట్టు చెప్పాడు. పరారీలో ఉన్న రవితేజ, సాయి సుధాకర్ కోసం గాలిస్తున్నారు.
41.9 కిలోల గంజాయి సీజ్
వెస్ట్ బెంగాల్ నుంచి గంజాయి తీసుకొస్తూ, హైదరాబాద్ (Hyderabad)లో అమ్ముతున్న గ్యాంగులోని ముగ్గురిని మాదాపూర్ ఎస్వోటీ అధికారులు, కొల్లూరు పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 41.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మిథున్బర్మన్(36), సుదేన్ రాయ్ (25), రాజావుల్ షేక్ (30), తపన్ బిశ్వాస్ వెస్ట్ బెంగాల్ వాస్తవ్యులు. తేలికగా డబ్బు సంపాదించేందుకు చాలా రోజులుగా నలుగురు కలిసి గంజాయి దందా చేస్తున్నారు. తపన్బిశ్వాస్ గంజాయి సప్లై చేస్తుంటే మిగతా ముగ్గురు కలిసి దానిని హైదరాబాద్ తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్‌చేసి కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్న వారికి అమ్ముతూ వస్తున్నారు.
ఈ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలి
ఇలాగే తెల్లాపూర్ గ్రామంలోని లేబర్ క్యాంప్ వద్ద మిథున్, సుదేన్, రాజావుల్ గంజాయితో రాగా, సమాచారం అందుకున్న ఎస్వోటీ అధికారులు, కొల్లూరు పోలీసులతో కలిసి దాడి చేసి అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయితోపాటు 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. పరారీలో ఉన్న తపన్ బిశ్వాస్ కోసం గాలిస్తున్నారు. మూడు కేసుల్లో అరెస్టయిన నిందితులు అందరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్టు డీసీపీ రితురాజ్ తెలిపారు. మాదక ద్రవ్యాల దందా గురించి తెలిస్తే 7901105423 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. 9490617444 నెంబర్‌కు వాట్సాప్ కూడా చేయవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామని చెప్పారు.
Also Read: Cyberabad Police: ఆడబిడ్డల జోలికొస్తే ఇక మీ పని అంతే.. షీ టీమ్స్ చూస్తున్నాయ్ జాగ్రత్త!

