Hyderabad Alert: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడుతో దేశమంతా ఉలిక్కిపడింది. 13ఏళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్లు వణికించాయి. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక కారులో బాంబు పేలింది. ఇది తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎనిమిది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని LNGP ఆసుపత్రిలో చేర్చారు. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద సాయంత్రం కారు బాంబు పేలిన విషయం తెలిసిందే. దీంట్లో 8మంది చనిపోయినట్టుగా అధికారవర్గాలు తెలిపాయి. కాగా, ఈ సంఘటనతో హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్టాండులు, షాపింగ్ మాల్స్, రద్ధీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, పార్కులు తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నారు.
Also Read: Delhi Car Blast: దిల్లీలో భారీ పేలుడు.. ఎర్రకోట సమీపంలో కారు బ్లాస్ట్.. గాల్లోకి ఎగిరిపడ్డ మృతదేహాలు
హైదరాబాద్ లో హై అలర్ట్
ఢిల్లీ పేలుళ్ల నేపధ్యంలో కేంద్ర హెూంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతాలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అయా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లకు రాష్ట్ర హెూంమంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసలు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు, నాకాబందీ చేపట్టాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సీపీ ఆదేశించారు. దీంతో ప్రధాన కూడళ్లతోపాటు రైల్వేస్టేషన్లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే, ఓల్డ్ సిటీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా.. మరేవైనా వస్తువులు కనిపించినా సమాచారం ఇవ్వాలని పోలీసు కమిషనర్ సజ్జనార్ నగరవాసులను కోరారు. డయల్ 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో హై అలర్ట్
దిల్లీ ఎర్రకోట మెట్రో వద్ద పేలుడుతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. హై అలర్ట్‌లో భాగంగా శంషాబాద్ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి క్యాబ్‌లను పార్కింగ్, ఇతర ప్రాంతాలన్నీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో ఎప్పడికప్పుడు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
Also Read: Vijay Breaks Silence: సీఎం సార్.. నా వాళ్లను టచ్ చేయొద్దు.. తొక్కిసలాటపై తొలిసారి విజయ్ స్పందన
