VC Sajjanar: కమిషనర్ సజ్జనార్ సంచలన నిర్ణయం
VC Sajjanar (imagecredit:twitter)
హైదరాబాద్

VC Sajjanar: కమిషనర్ సజ్జనార్ సంచలన నిర్ణయం.. సిటీ పోలీస్ ప్రక్షాళన పై ఫోకస్..!

VC Sajjanar: హైదరాబాద్ కమిషనరేట్‌లో భారీగా ప్రక్షాళన జరగనుందా?.. ప్రస్తుతం అధికారుల్లో జోరుగా నడుస్తున్న చర్చ ఇది. విధుల్లో అలసత్వం.. నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించేది లేదని పలుమార్లు స్పష్టంగా చెబుతున్న కమిషనర్ సజ్జనార్ ఈ దిశగా దృష్టిని సారించినట్టు సమాచారం. ఇప్పటికే ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవటం సిటీ పోలీసుల్లో చర్చనీయంగా మారింది.

వచ్చిన వెంటనే..

హైదరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే సజ్జనార్ ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూటిగా చెప్పారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంకితభావంతో పని చేసే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. ప్రతీ శనివారం ఉత్తమ పనితీరును కనబరిచిన సిబ్బందిని గుర్తించి వారికి ఎక్స్​ ట్రా మైల్ రివార్డు(Meenakshi Natarajan)లు ఇస్తానని తెలిపారు. ప్రశంసాపత్రం, రివార్డుతో సన్మానిస్తామన్నారు. అయితే, ఇప్పటికీ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న కొందరు ఇన్స్​ పెక్టర్లు, ఏసీపీ(ACP)లు పాత పద్దతుల్లోనే పని చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వైన్ షాపులు, బార్లు, పబ్బులు ఇలా దేన్నీ వదలకుండా నెలనెలా దండిగా మామూళ్లు వసూలు చేస్తున్నట్టుగా ప్రచారం ఉంది. ముడుపులు ముట్టజెప్పిన వారి పట్ల చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని పోలీసు వర్గాలే అంటున్నాయి.

Also Read: Vande Mataram: పెళ్లిలో వందేమాతర గేయం.. ఆసక్తికర సన్నివేశం

కమిషనర్ కఠిన చర్యలు..

మహంకాళి సబ్ డివిజన్ ఏసీపీ సైదయ్య(ACP Saidaiah) ఇలానే వైన్లు, బార్ షాపుల నుంచి మామూళ్లు తీసుకుంటూ వారికి సహకరిస్తున్నారని, వివాదాల్లో సెటిల్ మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు రావటంతోనే ఆయనను ఆర్మ్ డ్​ రిజర్వ్​ డ్ హెడ్​ క్వార్టర్స్​ కు బదిలీ చేసినట్టుగా చెబుతున్నాయి. ఇక, డ్యూటీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కూడా కమిషనర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి నిదర్శనంగా టప్పాఛబుత్రా సీఐ అభిలాశ్(CI Abhilash) ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఇటీవల పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులతో స్థానికంగా ఉంటున్న కొందరు ఘర్షణ పడ్డారు. దీనిపై అదే రోజు రాత్రి స్టేషన్​ కు ఫిర్యాదు కూడా అందింది. అయితే, కంప్లయింట్​ వచ్చిన వెంటనే కాకుండా మరుసటి రోజు కేసులు నమోదయ్యాయి. విషయం తెలిసి కమిషనర్ సజ్జనార్ ఏసీపీతో విచారణ జరిపించి నివేదిక తెప్పించుకున్నారు. దీంట్లో సీఐ అభిలాశ్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలటంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, ఆర్థిక నేరంలో నిందితునిగా ఉన్న వ్యక్తి పారిపోవటానికి సహకరించాడని ఆరోపణలు వచ్చిన టాస్క్ ఫోర్స్ ఎస్​ఐ శ్రీకాంత్ గౌడ్(SI Srikanth Goud) ను కూడా విధుల్లో నుంచి తప్పించారు.

స్టేషన్లలో ఏం జరుగుతోంది?

ఆయా పోలీస్​ స్టేషన్లలో సిబ్బంది పని చేస్తున్న తీరుపై కమిషనర్​ సజ్జనార్​ స్పెషల్ బ్రాంచ్​ సిబ్బంది ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్టుగా తెలిసింది. ప్రతీ పోలీస్​ స్టేషప్​ పరిధిలో స్పెషల్ బ్రాంచ్​ కు చెందిన కానిస్టేబుల్ విధుల్లో ఉంటాడు. వీరిపై ఎస్​ఐ, సీఐలు కూడా పని చేస్తుంటారు. వీరి ద్వారానే ఆయా పోలీస్​ స్టేషన్లలో ఏం జరుగుతోంది? అన్న వివరాలను సేకరిస్తున్నట్టుగా తెలియవచ్చింది. ఇటీవల సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించినపుడు తాను చెప్పినా కొంతమంది అధికారులు పని తీరును మార్చుకోవటం లేదని కమిషనర్​ సజ్జనార్ అన్న విషయం తెలిసిందే. 40 కేసుల్లో దర్యాప్తు నిర్లక్ష్యంగా జరిగిందని ఆయన అన్నారు. ఈ కేసుల్లో మళ్లీ దర్యాప్తు జరిపిస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే త్వరలోనే హైదరాబాద్ కమిషనరేట్ లో భారీగా ప్రక్షాళన జరగటం ఖాయమన్న చర్చ పోలీసు వర్గాల్లో నడుస్తోంది.

Also Read: MLC Phone Hacking: బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు ఫోన్ హ్యాక్ చేసిన దుండగులు.. పోలీసులకు ఫిర్యాదు!

Just In

01

Ranga Reddy District: దేవాదాయ భూమిపై రియల్ కన్ను.. చక్రం తిప్పిన పాత ఆర్డీవో!

Xiaomi Launch: అల్ట్రా ఫీచర్లతో Xiaomi 17 Ultra లాంచ్

Phone Tapping Case: ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలేనా? కేసీఆర్, హరీశ్ రావుల విచారణపై చర్చ!

Gram Panchayat: గ్రామ పంచాయతీలకు నిధులొస్తాయా?.. సర్పంచుల్లో టెన్షన్!

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!