LB Nagar Crime: ఫ్రెండ్ బిడ్డపైనే కన్నేశాడు.. పదేళ్ల జైలు శిక్ష
LB Nagar Crime[image credit: al]
హైదరాబాద్

LB Nagar Crime: ఫ్రెండ్ బిడ్డపైనే కన్నేశాడు.. పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

LB Nagar Crime: స్నేహితుని కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితునికి ఎల్బీనగర్​ లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పదేళ్ల జైలు శిక్ష, 15వేల రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి 5లక్షల రూపాయలను పరిహారంగా అందచేయాలని ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాలాపూర్​ షహీన్​ నగర్​ నివాసి సయ్యద్​ హాజీ అలీ (43) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్​. అతని స్నేహితుడు అనారోగ్య కారణాలతో కొన్నాళ్లు తన కూతురి సంరక్షణ బాధ్యతలను సయ్యద్​ కు అప్పగించాడు.

 Also Read: Hyderabad Drinking water: హైదరాబాద్ లో నీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడంటే?

ఈ క్రమంలో మైనర్​ బాలికను ఇంటికి తీసుకెళ్లిన సయ్యద్​ మాయమాటలు చెప్పి చిన్నారిపై లైంగిక దాడి జరిపాడు. విషయం తెలిసి బాధితురాలి తండ్రి పహాడీషరీఫ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోక్సో యాక్ట్​ ప్రకారం కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అరెస్ట్​ చేసి కోర్టుకు చార్జిషీట్​ దాఖలు చేశారు. అదనపు పబ్లిక్​ ప్రాసిక్యూటర్లు సునీత, రఘులు కేసులో వాదనలు వినిపించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?