తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Drinking water: హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై పథకం ఫేజు – 2 లో భాగంగా పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు రెండు చోట్ల ఏర్పడిన లీకేజీలకు జలమండలి మరమ్మతులను చేపట్టింది. ఈ పనులు లేట్ నైటు వరకు కొనసాగే అవకాశమున్నందున, శనివారం జరిగే నీటిలో సరఫరాలో భాగంగా పలు ప్రాంతాల్లో అంతరాయమేర్పడే అవకాశమున్నట్లు జలమండలి తెలిపింది.
ఓల్డ్ ముంబయి జాతీయ ప్రధాన రహదారి పై ఆర్సీ పురం, ఫాదర్ స్కూల్ వద్ద ఏర్పడిన లేకేజీ మరమ్మతుల పనులు కారణంగా నీటి సరఫరాలో అంతరాయమేర్పడే ప్రాంతాలు డివిజన్ల వారీగా ఇలా ఉన్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ డివిజన్-6లోని ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్ (లోప్రెజర్ తో నీటిసరఫరా), ఓ అండ్ ఎం డివిజన్ – 8 పరిధిలోని హఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు. ఓ అండ్ ఎం డివిజన్ – 9లోని కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్య నగర్ కాలనీ, వసంత్ నగర్.
డివిజన్ – 15లోని ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్ తో పాటు డివిజన్ – 24 లోని బీరంగూడ, అమీన్ పూర్, బొల్లారం ప్రాంతాల్లో జరిగే నీటి సరఫరాలో అంతరాయమేర్పడే అవకాశాలున్నట్లు జలమండలి పేర్కొంది. పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి కోరింది.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/