LB Nagar Court verdict [image credit: twitter]
హైదరాబాద్

LB Nagar Court verdict: పాపం పడింది.. మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన తీర్పు

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: LB Nagar Court verdict: మైనర్​ బాలికపై లైంగిక దాడి జరిపిన కేసులో నిందితునికి 2‌‌0 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ ఎల్బీనగర్​ లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు జడ్జి మంగళవారం తీర్పు చెప్పారు. చైతన్యపురి ద్వారకపురి నివాసి కాసర్ల మహేశ్​ ఎలియాస్​ బన్నీ (19) వృత్తిరీత్యా కూలీ. ఇదెలా ఉండగా రెండేళ్ల క్రితం తన ఇంటికి కొద్దిదూరంలోనే ఉంటున్న మైనర్​ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా లోపలికి వెళ్లిన మహేశ్​ భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

 Also Read : Alluri district News: తల్లి ముందే బిడ్డను ఎత్తుకెళ్లిన కిలేడీ.. 5 గంటల్లో సీన్ రివర్స్!

బాధితురాలి ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు చైతన్యపురి పోలీస్​ స్టేషన్​ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్​ చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషీట్​ సమర్పించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్​ ప్రాక్యూటర్లు సునీత, డీ.రఘు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జడ్జి నిందితుడైన మహేశ్​ కు 2‌‌0 సంవత్సరాల జైలుశిక్షతోపాటు 5వేల రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి పరిహారంగా 5లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు