Alluri district News: తల్లి ముందే బిడ్డను ఎత్తుకెళ్లిన కిలేడీ.. 5 గంటల్లో సీన్ రివర్స్!
Alluri district News(Image Credit: AI)
క్రైమ్

Alluri district News: తల్లి ముందే బిడ్డను ఎత్తుకెళ్లిన కిలేడీ.. 5 గంటల్లో సీన్ రివర్స్!

Alluri district News: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువులకు కూడా రక్షణ లేని రోజులు ఇవి! తల్లి చేతిలో ఉన్న బిడ్డకు సైతం గ్యారంటీ లేకుండా పోయింది. తల్లి నిద్రపోతున్నప్పుడో, శిశువు ఒంటరిగా ఉన్నప్పుడో అపహరణలు జరుగుతున్న సంఘటనలు గతంలో చూశాం. కానీ, అల్లూరి జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఓ గుర్తు తెలియని మహిళ తన మాయమాటలతో ఐదు రోజుల పసికందును తల్లి ఒడిలోంచి ఎత్తుకెళ్లింది. కాసేపటికి తేరుకున్న ఆ తల్లి తన బిడ్డ అపహరణకు గురైందని తెలుసుకుని విలవిలలాడింది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. కేవలం ఐదు గంటల్లోనే ఆ కిలాడీ మహిళను గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు శిశువును కాపాడారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వై రామవరం మండలంలోని పాముగొంది గ్రామానికి చెందిన సాధల కళావతి, వీరపురెడ్డి దంపతులకు ఐదు రోజుల క్రితం వైరవరం మండలం గుట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ) మగ శిశువు జన్మించాడు. మెరుగైన వైద్య సేవల కోసం ఈ శిశువును రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం భోజన సమయంలో తల్లి కళావతి దగ్గర ఉన్న శిశువును ఓ గుర్తు తెలియని మహిళ సందర్శకురాలిగా వచ్చి, ‘మీ బిడ్డకు బాగోలేదు, బాక్స్‌లో పెడతాను’ అంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది. కొద్ది సేపటి తర్వాత బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: రాష్ట్రంలో మరో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై!

ఈ ఘటనపై వెంటనే స్పందించిన రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, సమాచారాన్ని సేకరించిన పోలీసులు భద్రాచలం ఘాట్‌రోడ్ సమీపంలో శిశువును గుర్తించారు. అక్కడే అపహరణకు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఐదు గంటల్లోనే కేసును చేధించి, శిశువును తల్లికి అప్పగించడంతో కళావతి, వీరపురెడ్డి దంపతులు ఊపిరి పీల్చుకున్నారు.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గతంలో శిశు అపహరణ ఘటనలు ఆందోళన కలిగించాయి. 2019లో గుంటూరు జీజీహెచ్‌లో మూడు రోజుల శిశువును ఓ మహిళ అపహరించగా, పోలీసులు రెండు రోజుల్లో కాపాడారు. 2021లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రెండు రోజుల బిడ్డను ఓ వ్యక్తి తీసుకెళ్లగా, బస్టాండ్ వద్ద గుర్తించి రక్షించారు. 2022లో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో రెండు రోజుల శిశువును మహిళ ఎత్తుకెళ్లినా, మూడు గంటల్లో పోలీసులు పట్టుకున్నారు. అలాగే, 2020లో విశాఖపట్నం కేజీహెచ్‌లో నాలుగు రోజుల బిడ్డను ఓ జంట అపహరించింది. అప్పట్లో ఈ ఘటనలు ఆసుపత్రుల్లో భద్రతపై ఆందోళనలను రేకెత్తించాయి.

Also Read: తీవ్ర విషాదం.. అప్పుడే పుట్టిన శిశువు మృతి.. బంధువుల రాస్తారోకో
రంపచోడవరంలో జరిగిన ఈ ఘటన ఆసుపత్రుల్లో శిశువుల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎవరి వద్ద అప్పగించకుండా జాగ్రత్త వహించాలి. అదే విధంగా, ఆసుపత్రి యాజమాన్యాలు సీసీటీవీ కెమెరాలు, సిబ్బంది పర్యవేక్షణను మెరుగుపరచడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చు. పోలీసుల వేగవంతమైన చర్యలు ఈ కేసులో శిశువును కాపాడినప్పటికీ, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను అరికట్టవచ్చు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?