RV Karnan: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మౌలిక వసతులను కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ (RV Karnan) అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు సౌకర్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ లను ఆయన గురువారం పరిశీలించారు.
Also Read: RV Karnan: డీసీలపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్పెషల్ ఫోకస్.. ఎందుకో తెలుసా..!
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు
డీఆర్సీ సెంటర్ లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్ల సౌకర్యార్థం మంచినీరు, కరెంటు, టాయిలెట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ఈవీఎంలను ఏర్పాటు చేసే ప్రాంతంలో ఓటరుకు ఈవీఎంలు, వాటిలోని అభ్యర్థులు, కలర్ ఫొటోలతో పాటు ఎన్నికల సంఘం కేటాయి,చిన గుర్తులు స్పష్టంగా కన్పించేలా లైటింగ్ ఉండాలన్నారు. 407 పోలింగ్ స్టేషన్లున్న 139 లొకేషన్లలో లొకేషన్ కు ఒకటి చొప్పున వీల్ చైర్ లను అందుబాటులో ఉంచాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ లోకి వికలాంగులు వీల్ చైర్ లో లోనికి వెళ్లేలా ర్యాంప్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు
దీనికి తోడు ఎన్నికల ప్ర్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రతి పోలింగ్ స్టేషన్ లోని ప్రతి ఒక్కరి కదలికలను కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికపుడు పరిశీలించనున్నట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో 130 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ పోలింగ్ స్టేషన్ల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి, ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకుంటామని కర్ణన్ తెలిపారు. దీనికి తోడు ఈ సారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లలో అవగాహన, చైతన్య కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Also Read: RV Karnan: దుర్గం చెరువు పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశం!
