Illegal Soil Mining: మేడ్చల్ మండలంలో మట్టి మాఫీ ఆగడాలు మితిమీరి పోతున్నాయి. మేడ్చల్ మండలం ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రావల్ కోల్ లో రాత్రివేళ్లలో జోరుగా మట్టి దందా కొనసాగుతుంది. యదేచ్చగ టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నా రెవిన్యూ అధికారులు(Revenue officers), మైనింగ్ అధికారులు(mining officers) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. భూమిలలో మట్టిని తొవ్వుతూ పెద్ద పెద్ద గుంతలుగా చేస్తున్నారు. ఈ గుంతలతో రైతుల పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేధన వ్యక్తం చేసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మట్టి తవ్విన గుంతల్లో వర్షాకాలంలో నీరు నిండి ప్రమాదకంగా మారుతున్నాయి. ప్రాణ నష్టం జరిగితే గాని అధికారులు స్పందించరేమో అని పలువురు హేళన చేస్తున్నారు. రావల్ కోల్ మాత్రం మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రాత్రైతే చాలు రోడ్లపై అధిక లోడుతో, రోడ్లపైమట్టి పడుతున్నా విపరీతమైన వేగంతో గ్రామం నుండి మట్టిని తరలిస్తున్నారు. మట్టి మాఫియాపై స్థానికులు, రైతులు ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదు.
కుంగిపోతున్న రోడ్లు
మట్టి మాఫియా నిర్వహించే మట్టి దందాతో గ్రామాల్లోని రోడ్లు, పంట పొలాలకు వెల్లే రోడ్లు అధిక బరువుతో టిప్పర్లు వెల్లడంతో పగుల్లు వస్తున్నాయని గ్రామ ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పొలాలకు వెల్లే దారులలో టిప్పర్లతో అధిక బదువుగా మట్టి తరలిస్తుండడంతో రోడ్లు కుంగిపోతున్నాయి. పొలాలకు వెల్లాల్సిన రైతులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రైతు పొలాల నుండి మట్టి తరలించకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Also Read: Governors Powers: బిల్లుల ఆమోదంలో గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
పట్టించుకోని అధికారులు
అక్రమ మట్టి దందాతో మట్టి మాఫియా రెచ్చిపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రైతుల పంట పొలాల్లోంచి అక్రమ మట్టి తరలిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫిలితం లేకుండా పోయిందని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, రైతుల భూములు, చెరువులు అనేవి చూడకుండా మాకేరు అడ్డూ అన్నట్లు మట్టి మాఫియా రెచ్చిపోయి మరీ మట్టి దందాను కొనసాగిస్తున్నాయి. అక్రమ మట్టి దందాపై అధికారుల దృష్టికి తీసుకువెల్లినా తూ తూ మంత్రంగా మాటలు చెప్పి చేతులు దుపుకుంటున్నారు. అక్రమ మట్టి దందాపై పలు పత్రికల్లో వార్తలు రాసినా మట్టి మాఫియా మాత్రం బయపడడం లేదు. అదికారుల అండదండలతోనే ఈ మట్టి మాఫియా దందా కొనసాగుతుందని పలువురు అుమానం వ్యక్తం చేస్తున్నారు.
తహసిల్దార్ వివరణ
అక్రమ మట్టి తరలింపు పై తమదృస్టికి రాలేదని మేడ్చల్ తహసిల్దార్ భూపాల్(MRO Bupal) వివరణ ఇచ్చారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి భంగం కలిగిస్తే ఎంతటివారినైనా వదిపెట్టబోమని భూపాల్ వివరణ ఇచ్చారు.
Also Read: KTR – High Court: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట.. 2023 నాటి కేసు కొట్టివేత

