Illegal Constructions: ఆ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల రాజ్యం?
Illegal Constructions ( image credit: swetcha reporter)
హైదరాబాద్

Illegal Constructions: ఆ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల రాజ్యం? ఈ అక్రమాలు ఎవరి అనుమతితో సాగుతున్నాయి?

Illegal Constructions: హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న ఇంద్రేశం మున్సిపాలిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పేరు తెచ్చుకుంటోంది. కానీ ఆ అభివృద్ధి వెనుక దాగి ఉన్న అసలు ముఖం అక్రమ నిర్మాణాల రూపంలో బయటపడుతోంది. అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న భవనాలు—ఇవే నేటి ఇంద్రేశం వాస్తవ రూపం. నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టాలంటే ముందుగా అనుమతులు, ప్లాన్‌లకు కట్టుబాటు, సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ సదుపాయాలు తప్పనిసరి.

ఈ అక్రమాలు ఎవరి అనుమతితో సాగుతున్నాయి?

కానీ ఇంద్రేశం మున్సిపాలిటీలో ఇవన్నీ ఐచ్ఛికాలుగా మారిపోయాయన్న భావన ప్రజల్లో బలపడుతోంది. అనుమతులకు మించి మూడు నుంచి ఐదు అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలు, సెల్లార్ పార్కింగ్ స్థలాల్లోనూ వాణిజ్య సముదాయాలు ఇవన్నీ అధికారుల కళ్లముందే జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ ప్రశ్న ఒక్కటే ఈ అక్రమాలు ఎవరి అనుమతితో సాగుతున్నాయి? ప్రభుత్వ చట్టాలు ఉన్నా, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాలు ఉన్నా, అవి కేవలం పుస్తకాలు, కాగితాలకే పరిమితమవుతున్నాయా? జీహెచ్‌ఎంసీ చట్టం–1955లోని సెక్షన్ 461-ఏ ప్రకారం అక్రమ భవనాలను సీజ్ చేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ అధికారం ఇంద్రేశంలో అమలుకాకపోవడం వెనుక కారణాలు ఏంటన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

Also ReadIllegal Constructions: ఉమ్మడి రంగారెడ్డిలో ఫామ్ ల్యాండ్ వ్యాపారం.. పట్టించుకోని అధికారులు

బిల్డర్లతో కుమ్మక్కై అక్రమ వసూళ్లు 

అవినీతి ఆరోపణలు ఇక్కడ కొత్తవేమీ కావు. గతంలో పంచాయితీగా ఉన్న సమయంలోనే బిల్డర్లతో కుమ్మక్కై అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న కథనాలు ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోనూ చర్చనీయాంశంగా మారాయి. నూతన మున్సిపాలిటీ ఏర్పడినా వ్యవస్థ మారలేదన్న విమర్శలు, పాత ధోరణులే కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మున్సిపాలిటీ యాక్ట్–2019 పట్టణాలను క్రమబద్ధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. కానీ ఇంద్రేశం మున్సిపాలిటీలో ఆ యాక్ట్ అమలు కాగితాలకే పరిమితమైందన్న అభిప్రాయం బలపడుతోంది. ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడం, అక్రమాలను చూసీ చూడనట్లుగా వ్యవహరించడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అగ్నిమాపక సదుపాయాలపై తీవ్ర ప్రభావం

అక్రమ నిర్మాణాలు కేవలం చట్టపరమైన సమస్య మాత్రమే కాదు ఇవి ప్రజల భద్రతకు, పట్టణ భవిష్యత్తుకు ముప్పుగా మారతాయి. రోడ్లు, డ్రైనేజీ, పార్కింగ్, అగ్నిమాపక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ అక్రమాలు రేపటి రోజుల్లో పెద్ద ప్రమాదాలకు దారి తీయవచ్చన్న ఆందోళనను పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీని అక్రమ నిర్మాణాల గూటిగా మార్చాలా? లేక క్రమబద్ధమైన పట్టణంగా తీర్చిదిద్దాలా? అన్నది ఇప్పుడు ఉన్నతాధికారులు తేల్చాల్సిన ప్రశ్న. చట్టాన్ని అమలు చేయడంలో మౌనం వహిస్తే, అది కూడా ఒక విధమైన అనుమతేనన్న విమర్శలు తప్పవు. ఇకైనా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుని, అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు చూపాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.

Also Read: Medchal Illegal Constructions: మేడ్చల్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?