IAS Pratima Singh [ image credit: twitter]
హైదరాబాద్

IAS Pratima Singh:పెండింగ్ ఉంచొద్దు.. ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయండి.. జాయింట్ కలెక్టర్

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను త్వరితగతిన నియమించుకోవాలని అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సంబంధిత వివరాలను ఇఆర్‌ఓలకు అందజేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పెండింగులో ఉన్న ఓటరు దరఖాస్తు ఫారాలు, బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Also Read: Hyderabad Cyber Crime: వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు.. పని లేదన్నాడు.. అంతా దోచేశాడు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్ర నగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల, షాద్‌ నగర్‌, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతంలో 1,065 పోలింగ్‌ కేంద్రాలు, పట్టణ ప్రాంతంలో 2,436 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. అన్ని కేంద్రాలకు ఇప్పటికే బూత్‌ లెవెల్‌ పోలింగ్‌ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు.

ఈ ఏడాది మార్చి 20 నాటికి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో మొత్తం 36,75,050 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పెండింగులో ఉన్న ఓటరు దరఖాస్తులను క్లియర్‌ చేయడం జరుగుతున్నదని, ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చుల వివరాలను అందజేయని గతంలో పోటీచేసిన అభ్యర్థులు త్వరగా అందజేయాలని కోరారు. సమావేశంలో డిఆర్‌ఓ సంగీత, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https:https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?