Hydraa (imagecredit:twitter)
హైదరాబాద్

Hydraa: బిగ్ బ్రేకింగ్.. చెరువుల పై ప్రత్యేక నిఘా.. అలా అస్సలు చేయొద్దు?

Hydraa: గ్రేటర్ పరిధిలోని ట్రై సిటీల్లోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ ధ్యేయంగా చర్యలు చేపడుతున్న హైడ్రా(Hydraa) చెరువుల పరిరక్షణ విషయంలో మరో అడుగు ముందుకేసి ఆలోచించింది. ఇప్పటికే మూడు సిటీల్లోని చెరువులు కుంటలు సగానికి పైగా కబ్జాల పాలు కాగా, క్రమంగా వాటికి కబ్జాల నుంచి విముక్తి కల్గిస్తున్న హైడ్రా ఇకపై చెరువు(Pond)ల్లో వ్యర్థాలు వేయకుండా, కబ్జాల పాలు కాకుండా ఆధునిక నిఘా పెట్టేందుకు సిద్దమైంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని 185 చెరువుల వద్ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ క్లోజ్ సర్క్యూట్ కెమెరా(Internet Protocol Closed Circuit Camera)లతో నిఘాను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి మొత్తం 1500 హై క్వాలిటీ కెమెరాలను ఏర్పాటు చేయటంతో పాటు దాన్ని నేరుగా హైడ్రా కార్యాలయానికి లింకు చేసేలా ఏజెన్సీల నియామకం కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 23 నుంచి టెండర్లను స్వీకరిస్తుంది.

కల్కి రౌండ్ క్లాక్ నిఘా

ముఖ్యంగా హై క్వాలిటీతో ఎక్కువ రికార్డింగ్ సామర్థ్యం కల్కి రౌండ్ క్లాక్ నిఘా పెట్టే కెమెరాలను సమకూర్చాలని, ఇందుకు బిడ్లను సమర్పించాలని హైడ్రా టెండర్ నోటిఫికేషన్ లో పేర్కొంది. ముఖ్యంగా ఎక్కువ చెరువుల్లో రాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు వాహానాల్లో భారీగా వ్యర్థాలను తీసుకువచ్చి డంప్ చేస్తున్నట్లు గుర్తించిన హైడ్రా(Hydraa) రాత్రి పూట చక్కటి క్లారిటీతో రికార్డింగ్ చేసే కెమెరాలను ఏర్పాటు చేయటంతో పాటు రికార్డింగ్ నిర్వహణ బాధ్యతలను చేపట్టేలా ఏజెన్సీలకు సూచించింది. ఏజెన్సీల నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు టెండర్లను స్వీకరించి, ఆ తర్వాత ఏజెన్సీలను ఖరారు చేసిన పక్షం రోజుల్లోనే సోలార్(Solar) ఆధారిత 4 జీ నెట్ వర్క్ టవర్ తో పాటు ఐపీసీసీ(IPCC) కెమెరాల ఇన్ స్టాలేషన్, కమిషనింగ్, రికార్డు, హైడ్రా ఆఫీసుకు లింకు వంటి ప్రక్రియలను పూర్తి చేసేలా హైడ్రా చర్యలు చేపట్టనుంది.

Also Read: Jubilee hills Constituency: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయాల్లో కీలక మలుపు: మహేష్ కుమార్ గౌడ్

ఐపీసీసీ కెమెరాల ప్రత్యేకత ఇది

సాధారణంగా నివాసాలు, రోడ్లు, జనవాస ప్రాంతాల్లో వివిధ రకాల కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరా(CC Camera)లను ఏర్పాటు చేస్తుంటారు. వీటిలో అవసరమైనపుడు కావల్సిన క్లియర్ గా ఫుటేజీ ఔట్ పుట్ రాదు. కానీ ఇపుడు చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న ఐపీసీసీ కెమెరాల ప్రత్యేకత వేరు. ఐపీసీసీ కెమెరా అనేది ఐపీసీసీ బ్రాండ్ నుండి వచ్చిన కెమెరా (ఇంటర్నెట్ ప్రోటోకాల్ కెమెరా) గా పని చేస్తుంది. ఇది ఇంటర్ నెంట్ ప్రోటోకాల్ నెట్‌వర్క్ ద్వారా వీడియో, ఆడియోను చాలా క్లియర్ గా డిజిటల్ డేటాను ఔట్ పుట్ గా ఇస్తుంది. ఈ కెమెరాలు నైట్ విజన్, యాప్‌ల ద్వారా రిమోట్ యాక్సెస్ ను కూడా కల్గి ఉంటాయి. సమర్థవంతమైన స్ట్రీమింగ్ కోసం వివిధ కంప్రెషన్ టెక్నాలజీలు వంటి లక్షణాలతో కూడిన నిఘా నేత్రాలు ఈ కెమెరాలు. సాంప్రదాయ సీసీ టీవీ లాగా కాకుండా హై-డెఫినిషన్ వీడియో నాణ్యతతో హై క్వాలిటీ ఆడియో రికార్డింగ్ లను ఔట్ పుట్ గా ఇచ్చే సామర్ధ్యతను కల్గి ఉంటుంది. ఈ ఐపీ కెమెరాలను స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్‌లలో రిమోట్ ద్వారా రికార్డింగ్ చేసుకోవచ్చు. వీక్షించవచ్చు. వీడియో తో పాటు చక్కటి ఆడియో సామర్థ్యం కూడా కల్కి ఉండటం ఈ ఐపీ కెమెరాల ప్రత్యేకత.

Also Read: Cheteshwar Pujara: బిగ్ బ్రేకింగ్ .. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన పుజారా

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?