Jubilee hills Constituency (imagecredit:swetcha)
Politics

Jubilee hills Constituency: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయాల్లో కీలక మలుపు: మహేష్ కుమార్ గౌడ్

Jubilee hills Constituency: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటుంది. అధికార కాంగ్రేస్(Congress) పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో టికెట్ కోసం పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, సీనియర్ నాయకుడు మురళీగౌడ్ తాను ‘పక్కా లోకల్’ అని పేర్కొంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌(Mahesh Kumra Goud)కు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మరి కొందరు టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో మురళీ గౌడ్(Murali Goud) తాజాగా దరఖాస్తు సమర్పించటం కాంగ్రేస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకు బలమైన స్థానిక క్యాడర్ ఉందని, కాంగ్రెస్ అధిష్ఠానం తనకు అవకాశం ఇస్తే తప్పకుండా విజయం సాధిస్తానని మురళీగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన అనుభవం తనకుందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Srinivas Goud: ఎప్పుడూ అబద్ధాలే మాట్లాడతారా?.. కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

మురళీగౌడ్ రాజకీయ ప్రస్థానం

మురళీగౌడ్ తన దరఖాస్తులో తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు. ఆయన 1975 నుంచే హైదరాబాద్‌(Hyderabad)లో స్థిరపడినట్లు పేర్కొన్నారు. 1975లో అప్పటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి. జనార్థన్ రెడ్డి(MLA P. Janardhan Reddy) గెలుపు కోసం మురళీగౌడ్ సైకిల్ యాత్ర నిర్వహించినట్లు పేర్కొననారు. ​2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యూసుఫ్‌గూడ డివిజన్ నుంచి టీడీపీ కార్పొరేటర్‌గా గెలిచినట్లు, 2016లో ఆయన కుమారుడు సంజయ్ ఇదే డివిజన్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా విజయం సాధించినట్లు ఆయన పేర్కొ్నారు. ​2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు, 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన దరఖాస్తులో పేర్కొన్నారు. ​ఈ సారైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మురళీగౌడ్‌కు టికెట్ దక్కుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

Also Read: Traffic Challans: పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్‌ చేస్తామన్నా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్