Hydraa: వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి హైడ్రా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. కురిసిన వర్షానికి సహాయక చర్యల కోసం (Hydra) హైడ్రా 150 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను రంగంలోకి దించింది. ఒక్కో షిఫ్టులో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు మొత్తం 1800 మంది సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించింది. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో 368 స్టాటిక్ టీమ్‌లు ఏర్పాటు చేశారు.
ఒక్కో చోట రెండు షిఫ్టుల్లో పని చేసేలా 734 మందిని నియమించారు. వీరికి తోడు హైడ్రా (Hydra) డీఆర్‌ఎఫ్ బృందాలు 51 వర్షాకాల పనుల్లో నిమగ్నమయ్యాయి. ఒక్కో టీమ్‌లో 18 మంది చొప్పున, మొత్తం 918 మంది డీఆర్‌ఎఫ్ (DRF) సిబ్బంది సేవలందిస్తారని హైడ్రా పేర్కొంది. ఒక్కో షిఫ్టులో ఆరుగురు చొప్పున, వీరికి తోడు 21 ఎమర్జెన్సీ బైకు బృందాలు అందుబాటులో ఉంచినట్లు హైడ్రా (Hydra) తెలిపింది. ఒక్కో బైకుపైన ఇద్దరు చొప్పున మొత్తం 42 మంది ఉంటారు. 30 సర్కిళ్లలో పనులను పర్యవేక్షించేందుకు (Hydra) హైడ్రాకు చెందిన 30 మంది మార్షల్స్ ఉంటారని తెలిపింది. ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేసేందుకు రెండు షిఫ్టుల్లో కలిపి 200 మందితో 20 బృందాలు ఏర్పాటు చేశారు. చెట్టుకొమ్మలు, చెత్తను ఎత్తుకెళ్లేందుకు వీలుగా ఒక్కో షిఫ్టులో ముగ్గురు చొప్పున ఉండేలా 240 మందితో బృందాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు 4100 మంది సిబ్బంది సేవలందిస్తారని హైడ్రా (Hydra) తెలిపింది.
Also Read: Minister Komatireddy Venkat: ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటా.. మంత్రి స్పష్టం!
24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్ రంగనాథ్ ఆదేశం
వర్షం ఎప్పుడు వస్తుందో, ఎంత మొత్తంలో పడుతుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. వర్షానికి ముందే రహదారుల్లో నీరు వెళ్లేందుకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. నాలాలను, కల్వర్టులను పరిశీలించి వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా జాగ్రత్తపడాలన్నారు.
ఎక్కడ నీరు నిలుస్తుందో ముందుగానే ఒక అంచనాకు వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, చెట్లు పడిపోతే వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. హైడ్రా (Hydra) డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సహకరిస్తాయని, సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఆయా ప్రాంతాల హైడ్రా ఎస్‌ఎఫ్‌ఓలకు తెలియజేయడమే కాకుండా, ఆ సమాచారాన్ని హైడ్రా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కమిషనర్ రంగనాథ్ (Ranganath ఆదేశించారు.
పనిముట్ల పంపిణీ, శిక్షణ..
వరద నీరు నిలిచిన వెంటనే తోడేందుకు నీటి పంపులు, చెట్లు పడిపోతే తొలగించడానికి కటింగ్ మెషిన్లు, చెత్తను తొలగించడానికి అవసరమైన పరికరాలన్నీ 150 స్టాటిక్ బృందాలతో పాటు 51 డీఆర్‌ఎఫ్ (DRF) బృందాలకు అప్పగించారు. వర్షాకాలంలో పని చేసే ఈ బృందాలన్నిటికీ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి, వర్షాకాలంలో చేయాల్సిన డ్యూటీల గురించి వివరించారు. ఈ బృందాలన్నీ ఆయా డివిజన్లలో ఉండి సేవలందిస్తాయని, ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా, వీరు బాధ్యతతో సమస్యను పరిష్కరిస్తారని హైడ్రా పేర్కొంది. ట్రాఫిక్ సాఫీగా సాగేలా ట్రాఫిక్ పోలీసులతో 20 బృందాలు పని చేస్తాయని, అలాగే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తగిన వాహనాలను, పనిముట్లను కూడా హైడ్రా సమకూర్చింది. మొత్తం 242 మంది ఈ విధుల్లో ఉంటారని హైడ్రా (Hydra) తెలిపింది.
Also Read: High Court On Shami: పేసర్ షమీకి బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు.. గట్టి దెబ్బ పడిందిగా!