Minister Komatireddy Venkat( IMAGE CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

Minister Komatireddy Venkat: ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటా.. మంత్రి స్పష్టం!

Minister Komatireddy Venkat: పనుల్లో పురోగతి పెంచేందుకు కచ్చితంగా చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి ఫీల్డ్ విజిట్ చేయాల్సిందేనని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని అన్ని రకాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. శాఖపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటానని, ప్రతి రివ్యూకు పనుల పురోగతి చూపించాలని చెప్పారు. కేంద్రమంత్రి (Nitin Gadkari) నితిన్ గడ్కరీతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర వాటా 300 కోట్ల సీఆర్ఐఎఫ్ (CRIF) ఫండ్ వచ్చేలా కృషి చేశానని పేర్కొన్నారు.

 Also Read: Illegal Assets Cases: గత నెలలో 31 కేసులు కోట్లలో అక్రమాస్తుల గుర్తింపు!

బిల్స్ క్లియర్ అవుతుంటే అదే స్థాయిలో పనులు కూడా వేగంగా జరగాలని, పనులు పూర్తి చేయించాల్సిన బాధ్యత అధికారులదే కాబట్టి క్షేత్ర స్థాయిలో మానిటరింగ్ చేస్తూ అన్ని రకాల పనుల్లో ప్రోగ్రెస్ చూపించాలన్నారు. శాఖలో ఎన్నడూ లేనివిధంగా సీఎంతో మాట్లాడి ప్రమోషన్లు, పోస్టింగ్స్ ఇచ్చుకున్నామని, హుషారుగా పనిచేసి శాఖకు మరింత పేరు తీసుకురావాలని సూచించారు. హ్యామ్ రోడ్లు పది ప్యాకేజీలు మొదలు పెట్టేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఈఎన్సీ (Jaya Bharati) జయ భారతిని ఆదేశించారు.

రోడ్ యాక్సిడెంట్స్ నిర్మూలించేందుకు బ్లాక్ స్పాట్స్, వర్టికల్ కర్వ్స్ ముందే ఐడెంటిఫై చేయాలని సూచించారు. తెల్లాపూర్, అమీన్ పూర్, సంగారెడ్డి, (Sangareddy) మంచాల, చౌటుప్పల్ రోడ్లు, చిట్యాల, భువనగిరి, హలియ మల్లేపల్లి రోడ్లపై మంత్రి చర్చించారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఆర్ అండ్ బీ రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు భూ సేకరణ సమస్య కూడా లేకుండా ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు.

Also Read: Banakacherla Project: బనకచర్ల ప్రతిపాదనలు మొదలుపెట్టిందే బీఆర్ఎస్!

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు