Banakacherla Project(IMAGE credit: twitter)
Politics

Banakacherla Project: బనకచర్ల ప్రతిపాదనలు మొదలుపెట్టిందే బీఆర్ఎస్!

Banakacherla Project: బీఆర్ఎస్ పాలనలో గోదావరి, బనకచర్ల లింక్ ప్రతిపాదనలు మొదలు పెట్టారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. ప్రజా భవన్‌లో సీఎం, మంత్రులకు, కార్పొరేషన్ చైర్మన్లకు బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చర్చలు జరిపారన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనే ఈ మోసానికి పునాది పడిందని చెప్పారు. 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారన్నారు. 2018 మార్చి, జూన్, సెప్టెంబర్‌లలో ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా జీఓ లు ఇచ్చినా నాటి ముఖ్యమంత్రి నోరు మెదపలేదన్నారు.

 Also Read: Bhanakacherla Project: సీఎం రేవంత్ రెడ్డికి.. మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్!

జీఓఎంఎస్ 98 పేరుతో నిధులు మంజూరు చేసినా కేసీఆర్ (KCR) అడ్డు చెప్పలేదన్నారు. గోదావరి జలాలు కృష్ణా, పెన్నా నదికి మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రి (Jagan Mohan Reddy) జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరిపిందే కేసీఆర్ (KCR)  అని దుయ్యబట్టారు. రెండు రాష్ట్రాల నడుమ అధికారులు, నిపుణులతో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసిందే నాటి బీఆర్ఎస్ పాలకులు అని గుర్తు చేశారు. అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రభుత్వాన్ని బద్నాం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party)  అధికారంలోకి వచ్చాకే సమర్థవంతంగా అన్నీ ఎదుర్కుంటున్నామని తెలిపారు. గోదావరి జలాశయాలలో తెలంగాణ నీటి వాటా కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh)  ప్రతిపాదనలను గట్టిగా ప్రతిఘటించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (Revanth Reddy)  తాను స్వయంగా కేంద్రానికి వివరించినందునే ఈ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించారని ఉత్తమ్ తెలిపారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రభుత్వ విజయమేనని స్పష్టం చేశారు.

Also ReadBhanakacherla Project: మాకు సీమ రొయ్యల పులుసు అవసరం లేదు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!