Hydra( IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

Hydra: గ‌చ్చిబౌలిలో 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Hydera: కబ్జాల కోరల్లో చిక్కుకున్న మరో 600 గజాల స్థలాన్ని హైడ్రా (Hydra) కాపాడింది. ఈ స్థలం విలువ రూ. 11 కోట్ల వరకు ఉండవచ్చునని వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) శేరిలింగంప‌ల్లి మండ‌లం గ‌చ్చిబౌలిలోని తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ మ్యూచ్యువ‌ల్ ఎయిడెడ్ కోప‌రేటివ్ సొసైటీకి చెందిన 24 ఎక‌రాల లే ఔట్‌లో రెండు పార్కుల‌ను హైడ్రా ((Hydra)) కాపాడి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. హెచ్ఎండీఏ అనుమ‌తి పొందిన ఈ లే ఔట్‌లో పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను సొసైటీ నిర్వాహ‌కులు అమ్మిన‌ట్టు ఫిర్యాదులు అందిన నేప‌థ్యంలో హైడ్రా క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించింది.

 Also Read: Illegal Belt Shops: మద్యం బాటిల్ పై స్టిక్కర్ దందా.. వైన్స్ యజమానులే అధికారులా?

ఎవ‌రు అమ్మారు? ఎలా అమ్మారు?

పార్కుల స్థ‌లాలుగా నిర్ధారించుకున్న త‌ర్వాత ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఈ మేర‌కు హైడ్రా ప‌రిర‌క్షించిన స్థలాన్ని పార్కు స్థ‌లంగా పేర్కొంటూ హెచ్చ‌రిక‌ల బోర్డులు కూడా పెట్టింది. అక్రమంగా అమ్మ‌కాలు, కొనుగోళ్లు జ‌రిగిన తీరుపై పూర్తి స్థాయిలో విచారిస్తోంది. ఎవ‌రు అమ్మారు? ఎలా అమ్మారు? ఎలా కొన్నారు? అనే విష‌యాల‌తో పాటు వీటి వెనుక ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే దానిపై పూర్తి స్థాయిలో విచారించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హైడ్రా ప్ర‌క‌టించింది. ఇలా ఇంకా ఎన్ని స్థ‌లాలు అమ్మారు? అనేది ప‌రిశీలించి, అక్ర‌మ లావాదేవీలు నిర్వ‌హించిన వారిపై కేసులు కూడా పెడుతున్న‌ట్టు హైడ్రా వెల్లడించింది.

Also Read: Pig Kidney Transplant: వైద్య రంగంలో సంచలనం.. 54 ఏళ్ల వ్యక్తికి.. పంది కిడ్నీ అమర్చిన వైద్యులు

Just In

01

Daggubati Family Case: నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి సోదరులు.. హాజరు కాకపోతే నోటీసులు జారీ!

CM Revanth Reddy: గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి.. అనుమ‌తులివ్వాలని కేంద్ర మంత్రికి వినతి

Telangana Electricity: రికార్డును బ్రేక్ చేసేలా విద్యుత్ వినియోగం.. ఎంత వాడారో తెలిస్తే షాక్ కావాల్సిందే..?

N Ramchandra Rao: పరీక్ష హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం: రాంచందర్ రావు

KCR: కవిత లొల్లితో కేసీఆర్‌‌కి చిక్కులు.. సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి..?