Hydra ( IMAGE credit: swwetcha reporter)
హైదరాబాద్

Hydra: శంషాబాద్ లో హైడ్రా యాక్షన్.. రూ. 500 కోట్ల విలువైన భూమి స్వాధీనం

Hydra:  ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా మరింత యాక్టీవ్ గా పని చేస్తుంది. కబ్జాలపాలైన ప్రభుత్వ భూమలను గుర్తించి కాపాడేందుకు హైడ్రా(Hydra) జల్లెడ పడుతున్నట్లు సమాచారం. పైగా కుటుంబం నుంచి కొనుగోలు చేశామని చెప్పకుంటూ పాగా వేసిన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించి. ఈ క్రమంలో ఇప్పటికే వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న హైడ్రా తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో రూ.500 కోట్ల రూపాయల విలువైన 12 ఎకరాల భూమిని శనివారం స్వాధీనం చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా (Rangareddy District) శంషాబాద్ మండలం శాతంరాయ్ గ్రామంలోని సర్వే నంబర్ 17 లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది. చుట్టూ నిర్మించిన ప్రహరీతో పాటు లోపల ఏర్పాటు చేసిన షెడ్డులను సైతం హైడ్రా తొలగించింది. తొలగించింది. ఈ భూమిని రాష్ట ప్రభుత్వం 2011 లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డుకు కేటాయించిందని, అయితే ఈ భూమి తమదంటూ ఓ స్థానిక నాయకుడితో పాటు అనీష్ కన్ స్ట్రక్షన్ అనే సంస్థ క్లెయిమ్ చేస్తోంది. ఈ మేరకు అక్కడ అనీష్ కన్ స్ట్రక్షన్ సంస్థ బోర్డులు కూడా పెట్టింది.

 Also Read: Renu Agarwal Murder Case: రేణు అగర్వాల్ హత్య కేసులో.. క్యాబ్ డ్రైవర్​ ఇచ్చిన సమాచారంతో వీడిన మిస్టరీ.. కారణాలు ఇవే?

కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నించడంతో స్థానికులు హైడ్రాకు ఫోటోలను పంపించారు. రాళ్ళు రప్పలతో వ్యవసాయ యోగ్యానికి అనుకూలంగా లేని ఈ ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తున్నామంటూ, అసఫ్ జాహీ పైగా కుటుంబ వారసుల నుంచి కొన్నామంటూ కబ్జాదారులు చెబుతున్నారు. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు కూడా ఇదే సమయంలో హైడ్రాకు ఫిర్యాదు చేయటతో హైడ్రా సమయస్పూర్తితో వ్యవహారిస్తూ రంగంలోకి దిగింది. ఇలా స్థానికులతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా స్థానిక

రెవెన్యూ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఈ భూమి పక్కాగా ప్రభుత్వానిదేనన్న విషయాన్ని నిర్థారించుకుని ప్రహరీ, షెడ్డులను తొలగించింది. అంతేగాక, ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అంటూ హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.

శంషాబాద్ మండలంలో పైగా భూములు లేవు: హైడ్రా

శంషాబాద్ పరిధిలో పైగా కుటుంబాలకు చెందిన భూములు లేవని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించినట్లు హైడ్రా వెల్లడించింది. వేరే చోట ఉన్న ఆ భూముల రికార్డులను ఇక్కడ చూపించి కబ్జాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. అనీష్ కన్ స్ట్రక్షన్ సంస్థకు చెందిన శ్రీపాద దేశ్ పాండే పలు భూముల వివాదాల్లో ఉన్నట్టు ఫిర్యాదులందినట్లు హైడ్రా తెలిపింది. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే శంషాబాద్ మండలం శాతం రాయ్ గ్రామంలో ఉన్న 12 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఈ 12 ఎకరాలలో ఒక ఎకరం పరిధిలో ఉన్న కొన్ని నివాసాలు, ఒక దేవాలయం, మసీదును కాపాడుతూనే మిగతా భూమికి కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించి, ఫెన్సింగ్ చేసినట్లు హైడ్రా తెలిపింది.

 Also Read: Husband Suicide: ‘నా భార్య వేధిస్తోంది.. భరించలేకపోతున్నా’.. అంటూ భర్త సూసైడ్

Just In

01

Charan and Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా?

TG Vishwa Prasad: రజినీకాంత్ ‘అరుణాచలం’ టైప్ కాదు.. నాకు డబ్బు విలువ తెలుసు!

BRS BJP talks: బెడిసిన గులాబీ వ్యూహం… బీజేపీ నేతలతో ఇద్దరు కీలక నేతల భేటీ?

Manchu Manoj: ముందు అక్క సినిమా వస్తోంది.. తర్వాత ‘ఓజీ’.. మూవీ లవర్స్‌కు ఫీస్ట్!

Modi Manipur visit: జోరు వానలో హెలికాప్టర్ వద్దన్న భద్రతా సిబ్బంది.. మోదీ డేరింగ్ నిర్ణయం!