Hydra: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై సిటీల్లోని సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాలను కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా (Hydra) మరో బిగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇప్పటి వరకు సుమారు రూ. 50 వేల కోట్ల పై చిలుకు విలువైన సర్కారు భూములను కాపాడిన హైడ్రా తాజాగా మరో రూ.139 కోట్ల విలువైన భూమికి కబ్జాల చెర నుంచి విముక్తి కల్గించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా తొలగించింది. బద్వేల్ ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2, లలోని నాలుగు పార్కుల్లోని ఆక్రమణలను హైడ్రా తొలగించింది. సుమారు 19 వేల 878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది.
Also Read: Hydra: బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల.. ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
120 ఎకరాల్లో ఫేజ్-1,2 పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు
దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్-1,2 పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్ లో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించిన తర్వాతే హైడ్రా యాక్షన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకుని వేసిన షెడ్డులను ,రూమ్ లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెంటనే హైడ్రా ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
Also Read: Hydraa: హైడ్రాకు హై కోర్టు అభినందనలు.. ప్రశంసించిన జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి
